
Harbhajan Singh Comments On Yuzvendra Chahal: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి టీ20 ప్రపంచ కప్ జట్టులోకి వస్తాడాని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ థీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్2021 సెకెండ్ పేజ్‌లో చాహల్ అధ్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో సెలక్టర్‌లపైన పలువురు మాజీ ఆటగాళ్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో చాహల్ జట్టుకు ఎంపికవుతాడని హర్భజన్ సింగ్ కూడా ట్వీట్ చేయడం గమనర్హం.
"భారత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందడానికి చాహల్ 'సరైన వేగంతో' బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. . టీ 20 ప్రపంచ కప్‌లో చాహల్‌ను భారత జట్టులో చూడాలని తాను ఇప్పటికీ ఆశిస్తున్నానని, టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు కూడా జట్టులో మార్పులు జరగవచ్చు" అని భజ్జీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అయితే 15 మంది సభ్యలుతో కూడిన భారత జట్టును బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజ్వేంద్ర చాహల్ దక్కకపోవడం అందరనీ ఆశ్యర్యపరిచంది. ఐసీసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. జట్లు అక్టోబర్ 10 లోపు తమ జట్టులో మార్పులు చేయవచ్చు. కాగా టీ20 ప్రపంచకప్ ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా జరగనుంది.