టీమిండియా జెర్సీలో చహల్(PC: BCCI)- భార్యతో చహల్(PC: Dhanashree Verma)
Dhanashree Verma Birthday Post For Chahal Melts Hearts: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ పుట్టినరోజు నేడు(జూలై 23). శనివారం అతడు 32వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా చహల్‌కు సోషల్ మీడియా వేదికా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర ఆటగాళ్లు, అభిమానులు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో చహల్ భార్య ధనశ్రీ భర్తతో దిగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘జీవితమనే ప్రయాణంలో ఎన్నెన్నో అందమైన మలుపులు. నువ్వు మంచివాడివి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నేను నీకు వీరాభిమానిని’’ అంటూ విషెస్ తెలిపింది.
ఇక బీసీసీఐ సైతం.. ‘‘127 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 192 ఇంటర్నేషనల్ వికెట్లు.. పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్ల మార్కు అందుకున్న భారత బౌలర్.. టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి టీమిండియా బౌలర్’’ అంటూ చహల్ ప్రతిభను కొనియాడుతూ ఈ లెగ్ స్పిన్నర్‌ను విష్ చేసింది.
127 international games 👌
— BCCI (@BCCI) July 23, 2022
192 international wickets 💪
Fastest Indian bowler (in Men's cricket) to scalp 50 T20I wickets 👍
1st Indian bowler (in Men's cricket) to take a 5-wicket haul in T20Is 🔝
Here's wishing #TeamIndia leg-spinner @yuzi_chahal a very happy birthday. 🎂👏 pic.twitter.com/aGtBAyFP0q
అదే విధంగా.. టీమిండియా క్రికెటర్లు దినేశ్ కార్తిక్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ సహా రాబిన్ ఊతప్ప, ఆర్పీ సింగ్ తదితరులు చహల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
జింబాబ్వేతో మ్యాచ్‌తో...
1990 జూలై 23న హర్యానాలోని జింద్‌లో చహల్ జన్మించాడు. 19 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన ఈ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
అయితే, ఐపీఎల్-2011లో ముంబై ఇండియన్స్ తరఫున క్యాష్ రిచ్‌లీగ్‌లో ఎంట్రీతో అతడు వెలుగులోకి వచ్చాడు. అయితే, ముంబై ఫ్రాంఛైజీ అతడికి ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వలేదు. ఈ క్రమంలో 2014లో వేలంలోకి వచ్చిన చహల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
అప్పటి నుంచి తనను తాను నిరూపించుకునే అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకుని ఆర్సీబీలో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో 2016లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20ల్లోనూ జింబాబ్వేతో సిరీస్‌లో పొట్టి ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆడిన 127 మ్యాచ్‌లలో చహల్ 192 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చహల్ భాయ్...27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలిచాడు. ఇక ప్రస్తుతం అతడు వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం నాటి మొదటి వన్డేలో చహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది.
Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b
— Windies Cricket (@windiescricket) July 22, 2022
ఇక యూట్యూబర్ ధనశ్రీ వర్మతో 2020లో చహల్ వివాహం జరిగింది. ఆమె ఎప్పటికప్పుడు తన, భర్త కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లు పంచుకుంటూ అభిమానులకు చేరువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
చదవండి: Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్!
Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే!
Comments
Please login to add a commentAdd a comment