బీసీసీఐ.. ఈ ఏడాది టీమిండియా షెడ్యూల్‌లో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జులై-ఆగస్ట్‌లలో జరిగే వెస్టిండీస్ పర్యటన భారత్ జట్టును అదనంగా రెండు టీ20లు ఆడించేందకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం విండీస్ పర్యటనలో భారత జట్టు 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది.
అయితే బీసీసీఐ టూర్ లెంగ్త్‌ను పెంచుతూ అదనంగా రెండు టీ20లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు బీసీసీఐ జూన్‌లో మరో హోం సిరీస్‌ను కూడా ప్లాన్ చేస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ముందు శ్రీలంక లేదా ఆఫ్ఘనిస్తాన్‌లతో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment