వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌కు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను పక్కన పెట్టడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అతడి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరును చాలా మంది మాజీలు తప్పుబడున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పటికి.. పుజారా ఒక్కడినే బలిపశువును చేయడం సరికాదు అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం విమర్శించాడు.
తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పుజారాకు మద్దతుగా నిలిచాడు. పుజారా వంటి అనుభవం ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
"విండీస్‌తో టెస్టులకు ఛతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు భారత జట్టుకు వెన్నెముక వంటి వాడు. చాలా మ్యాచ్‌ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడిని జట్టు నుంచి తప్పించకుండా కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుత భారత టెస్టు జట్టులో మిగితా బ్యాటర్లు సగటు కూడా అంతగా బాగోలేదు.
అటువంటి అప్పుడు పుజారా ఏం తప్పు చేశాడు. ఎంత పెద్ద ఆటగాడైనా ఆడకపోతే పుజారా లాగే జట్టు నుంచి తప్పించాలి. సెలక్టర్లు అలా చేయగలరా? మీరు పుజారాను కీలక ఆటగాడిగా పరిగణించకపోతే.. మిగితా ఆటగాళ్లు కూడా అంతకన్న తక్కువే.
పుజారా కెరీర్ గురించి మనం ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ గడ్డలపై భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు. అతడు 100కు పైగా టెస్టులు ఆడాడు. అటువంటి వ్యక్తి మీరు ఇలా చేయడం సరికాదు. అతడికి సరైన గౌరవం ఇవ్వాలి" అని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Sunil Gavaskar: వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు?
Comments
Please login to add a commentAdd a comment