టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కనుబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విరాట్ దారుణంగా విఫలమయ్యాడు.
మొత్తంగా కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్-2024లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన విరాట్.. పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
దీంతో కొంతమంది పాక్ మాజీ ఆటగాళ్లు విరాట్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లిది ఎటువంటి తప్పులేని, న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ అస్సలు బ్యాటింగ్‌కు అకుకూలించలేదని భజ్జీ చెప్పుకొచ్చాడు.
"న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్‌లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు.
అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్‌లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్‌గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది.
ఆ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్‌లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్‌లను ఆశిస్తోంది.
అంతేకాకుండా ఓపెనర్‌గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. తొలి 6 ఓవర్లలో రోహిత్, విరాట్ మంచి ఆరంభాలను ఇస్తే.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వంటి వారు తమపని తాము చేసుకుపోతారని" స్టార్‌స్పోర్ట్స్‌తో హర్భజన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment