భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజర్లు గత ఆరు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రెజర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఇందులో ప్రముఖ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సహా ఇతర రెజర్లు పాల్గొన్నారు. ఇక ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా భారత మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు హర్భజన్ సింగ్ సపోర్ట్‌గా నిలిచాడు. దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చిన రెజర్లు రోడ్డు రోడ్డుపైకి రావడం చాలా బాధాకరమని భజ్జీ అన్నాడు. "సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లు భారతదేశానికి గర్వకారణం.
అటువంటి రెజర్లు మన దేశ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నందుకు క్రీడాకారిణిగా నేను బాధపడుతున్నారు. వారికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను" అని హర్భజన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. భజ్జీతో పాటు జావిలిన్ త్రో స్టార్ నిరాజ్ చోప్రా, సానియా మీర్జా కూడా సపోర్ట్‌గా నిలిచారు.
Sakshi, Vinesh are India's pride. I am pained as a sportsperson to find pride of our country coming out to protest on the streets. I pray that they get justice.#IStandWithWrestlers pic.twitter.com/hwD9dKSFNv
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 28, 2023
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023
చదవండి: Wrestlers Protest: దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారు.. పీటీ ఉష ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment