
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జైశ్వాల్.. తన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులు చేశాడు.
ఇక డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన జైశ్వాల్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైస్వాల్ అద్భుతమైన ఆటగాడని, చాలా కాలం పాటు భారత్ తరఫున ఆడతాడని హర్భజన్ కొనియాడాడు.
"యశస్వి జైస్వాల్ తొలి మ్యాచ్‌లోనే తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్నాడు. అతడు డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయినందుకు చాలా బాధ అనిపించింది. కానీ జైశ్వాల్ ఇండియన్ క్రికెట్‌ను చాలా కాలం పాటు కచ్చితంగా ఏలుతాడు. జైశ్వాల్‌కు టాలెంట్‌లో కొదవలేదు. అతడికి నేను ఇచ్చే సలహా ఒక్కటే.
జైశ్వాల్ ప్రపంచక్రికెట్‌ను శాసించాలంటే మరింత కష్టపడి పనిచేయాలి. అదే విధంగా ఫిట్‌నెస్‌ను కూడా కాపాడుకుంటూ రావాలి. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా రోజుల తర్వాత అతడి బ్యాట్ నుంచి వచ్చిన సెంచరీ. కోహ్లి కూడా సెంచరీ మార్క్‌ను అందుకుని ఉంటే బాగుండేది" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: AFG vs BAN: ఆఖరి టీ20లో ఆఫ్గానిస్తాన్ చిత్తు.. బంగ్లాదేశ్‌దే సిరీస్