ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి దిగ్గజ క్రికెటర్‌గా మన్ననలు అందుకుంటున్న సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ఫోటోను విడుదల చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టిన రోజు (డిసెంబర్ 12)సందర్బంగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, యువరాజ్‌లతో దిగిన పాత పోటోలను సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. యూవీ పుట్టిన రోజు వేడుకలను తన మిత్రులతో కలిసి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని సచిన్ అన్నాడు.
యూవీ స్పందిస్తూ.. సచిన్ పోస్ట్ చేసిన ఫోటోలో తన చెయ్యి కనిపించలేదంటూ యూవీ ఫన్నీగా కామెంట్ చేశాడు. కాగా తన సహచర క్రికెటర్లు మాట్లాడుతుండగా కాళ్లు లాగడం, సోషల్ మీడియా పోస్ట్‌లను చమత్కరించడంలో యూవీ ప్రసిద్ది పొందిన విషయం తెలిసిందే. డిసెంబర్ 12 న యువరాజ్ సింగ్ తన పుట్టినరోజు జరుపుకోగా, 2019 లో అత్యధికంగా నెటిజన్లు శోధించిన భారత క్రీడాకారుడిగా యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించాడు.
చదవండి: ‘మనం కన్నీళ్లను దాచనవసరం లేదు’
Comments
Please login to add a commentAdd a comment