కోల్‌కతా: ఐపీఎల్–11 వేలానికి ముందు సీనియర్ క్రికెటర్లతో పాటు, యువ కెరటాలు సత్తా చాటేం దుకు సన్నద్ధమయ్యారు. నేటినుంచి జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సూపర్ లీగ్ దశలో పలువురు అగ్రశ్రేణి, వర్ధమాన క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్‌లో గత జట్లు తమను కొనసాగించకపోవడంతో యువరాజ్, గంభీర్, హర్భజన్‌వంటి సీనియర్లు వేలంలోకి వస్తున్నారు. వీరందరూ ఈ టోర్నీలో చెలరేగి ఫ్రాంచైజీల దృష్టిలో పడాలని చూస్తున్నారు. ఇక యువ ఆటగాళ్లలో ఇటీవల 32 బంతుల్లో సెంచరీ సాధించిన రిషభ్ పంత్‌పై మరో సారి అందరి దృష్టి నిలిచింది.
నేటి నుంచి కోల్‌కతా వేదికగా జరుగనున్న ఈ టోర్నీ సూపర్ లీగ్‌లో 10 జట్లు రెండు గ్రూపులుగా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో బరిలో దిగనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో పంజాబ్, కర్ణాటక, జార్ఖండ్, ముంబై, రాజస్తాన్; గ్రూప్ ‘బి’లో ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, బరోడా, ఉత్తరప్రదేశ్ జట్లు ఉన్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో తమిళనాడుతో ఢిల్లీ, బరోడాతో బెంగాల్, కర్ణాటకతో పంజాబ్, జార్ఖండ్‌తో ముంబై తలపడనున్నాయి.
సత్తా చాటేందుకు సీనియర్లు సిద్ధం
Published Sun, Jan 21 2018 1:40 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment