Mushtaq Ali Trophy
-
BCCI: దేశవాళీ క్రికెట్లో ప్రోత్సాహకాలు
ముంబై: దేశవాళీ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోరీ్నలలో నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రమే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించేవారు. వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్‌మనీ మాత్రం లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలోనైతే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్‌కు సంబంధించిన అన్ని టోరీ్నల్లోనూ, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లకు కూడా తాజా ‘ప్రైజ్‌మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు. మంచి ప్రదర్శనకు తగిన గుర్తింపు ఇచ్చే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని... బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
టి20లకు కొత్త ‘మెరుపు’
ముంబై: టి20లు ఎక్కడ జరిగినా దానికున్న క్రేజే వేరు. భారత్‌లో అయితే మరీనూ! అందుకే పొట్టి ఆటకు మరో ‘మెరుపు’ జత చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి ప్రయత్నమే చేస్తోంది. విశేష ఆదరణ చూరగొన్న టి20 క్రికెట్ ప్రాచుర్యాన్ని మరింత పెంచాలని సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘టాక్టికల్ సబ్‌స్టిట్యూట్’ను ప్రవేశ పెట్టనుంది. ముందుగా దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేసి... అందులో విజయవంతమైతే వెంటనే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోనూ కొత్త సొబగుతో సరికొత్త ‘షో’కు శ్రీకారం చుట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్ 11 నుంచి జరిగే ముస్తాక్ అలీ టోర్నీలో ‘టాక్టికల్ సబ్‌స్టిట్యూట్’ నిబంధన తీసుకొస్తున్నట్లు బోర్డు ఇది వరకే అనుబంధ రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏంటీ ఇంపాక్ట్ ప్లేయర్ కథ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కొత్తేం కాదు. ఆటగాడు గాయపడితే సబ్‌స్టిట్యూట్‌ను ఎప్పటి నుంచో ఆడిస్తున్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు వీల్లేదు. ఫీల్డింగ్‌కే పరిమితం! తలకు గాయమైన సందర్భంలో కన్కషన్ అయితే మాత్రం బ్యాటింగ్, లేదా బౌలింగ్ చేసే వెసులుబాటు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు ఉంది. అయితే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ భిన్నమైంది. టాస్కు ముందు తుది జట్టుకు అదనంగా నలుగురు ఆటగాళ్ల జాబితా ఇస్తారు. ఇందులో ఒకరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా పూర్తిస్థాయి ఆటగాడి హక్కులతో ఆడతాడు. 14వ ఓవర్ పూర్తయ్యేలోపు తుది 11 మందిలో ఒకరిస్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ను బరిలోకి దింపొచ్చు. ఇది గేమ్ చేంజర్ కాగలదని బీసీసీఐ భావిస్తోంది. ఈ తరహా నిబంధన బిగ్‌బాష్ లీగ్‌లో కొన్ని షరతులతో ఉంది. అప్పట్లో... వన్డేల్లో! క్రికెట్లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ప్రయోగం కొత్తేం కాదు. 17 ఏళ్ల క్రితం వన్డేల్లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని ఆడించారు. ఐసీసీ 2005లో ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం టాస్కు ముందు 12వ ఆటగాడిగా ఆ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను జట్లు ప్రకటించేవి. తుది జట్లకు ఆడించేవి. కారణాలేవైనా 2006 ఏడాది తర్వాత ఈ నిబంధనను ఎత్తేశారు. -
నాలుగు రోజుల్లోనే మారిన కోచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్వాన్న పనితీరుకు మరో నిదర్శనం! దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం హెచ్‌సీఏ శనివారం 20 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే గత మంగళవారమే జట్టు కోచ్‌గా రంజీ మాజీ ప్లేయర్ అనిరుధ్ సింగ్‌ను ఎంపిక చేసిన హెచ్‌సీఏ ఇంతలోనే అతడిని తొలగించింది. అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జాకీర్ హుస్సేన్‌ను కొత్త కోచ్‌గా ప్రకటించింది. టీమ్‌ను ఎంపిక చేసే క్రమంలో హెచ్‌సీఏ నిర్వహిస్తున్న అంతర్గత టోర్నీ మ్యాచ్‌లకు అనిరుధ్ హాజరయ్యాడు కూడా. కానీ హెచ్‌సీఏ పెద్దల ప్రాధాన్యాలు మారిపోయాయి. అనిరుధ్ కోచ్‌గా పనికి రాడంటూ అతడిని పక్కన పెట్టేశారు. జట్టు ఎంపికలో తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయడమే కోచ్‌గా అనిరుధ్ చేసిన తప్పని తెలుస్తోంది! గత సీజన్లో కూడా అండర్–19 కోచ్‌గా వ్యవహరించిన అనిరుధ్‌ను సీజన్ మధ్యలోనే తప్పించింది. మరోవైపు కెప్టెన్‌గా మళ్లీ తన్మయ్ అగర్వాల్‌నే హెచ్‌సీఏ నియమించింది. గత రంజీ ట్రోఫీ సీజన్లో అతని సారథ్యంలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు చిత్తుగా ఓడినా ‘తమవాడు’ కాబట్టి మరోసారి కెప్టెన్సీని అప్పగించింది. జట్టు వివరాలు: తన్మయ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అభిరథ్ రెడ్డి, హిమాలయ్, సందీప్, రాహుల్ బుద్ధి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, సుమంత్, మిలింద్, టి.రవితేజ, అజయ్‌దేవ్ గౌడ్, యుధ్వీర్ సింగ్, తనయ్ త్యాగరాజన్, మికిల్ జైస్వాల్, హితేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్, ప్రతీక్ రెడ్డి, రక్షణ్, కార్తికేయ, ఎంఎస్ఆర్ చరణ్. -
దిగ్గజ క్రికెటర్‌ను అవమానపరుస్తారా?
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను మరో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలా మార్చలేమన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి చెందిన ఓ అధికారి చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డారు. మొదట షెడ్యూల్ ప్రకారం ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ను జరుపుదామని బీసీసీఐ ప్రయత్నించినా, విదేశీ ఆటగాళ్లుంటేనే బావుంటుందనే ఆలోచనతో లీగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి దేశవాళీ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ప్రస్తావన తెచ్చారు. ‘ఐపీఎల్‌ను.. తక్కువ నాణ్యత కలిగిన టోర్నీగా ప్రదర్శించలేమని చెబుతూ, మరో ముస్తాక్ అలీ టోర్నీ అవసరం లేదన్న ఆ అధికారి వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. ఎందుకంటే వారు ఓ దిగ్గజాన్ని అవమానపరిచారు. ఆ తర్వాత దాన్ని పేలవ టోర్నీగా పేర్కొన్నారు. మరి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీని ఎందుకు నిర్వహిస్తున్నారు.(ధోని భవితవ్యంపై గావస్కర్ స్పందన..) ముందు ఆ టోర్నీ పేరు చెప్పి ఓ గ్రేట్ మ్యాన్‌ను అగౌరవపరిచారు. ఆ తర్వాత పేలవమైన టోర్నమెంట్ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ టోర్నీ ఎందుకు పేలవంగా మారింది. ఆ టోర్నీలో అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండరు అనే విషయం తెలుసుకదా. అది దేశవాళీ టోర్నీ. అంతర్జాతీయి స్థాయిలో ఆడే భారత ఆటగాళ్లు లేకపోవడం వల్లే అది పేలవంగా మారిపోయింది. బీసీసీఐ బిజీ షెడ్యూల్ కారణంగా ముస్తాక్ అలీ టోర్నీకి ఆదరణ తగ్గింది. దీనిపై బీసీసీఐ కచ్చితంగా దృష్టి సారించాలి. ఆ టోర్నీని మెరుగుపరిచే అంశంపై ఫోకస్ చేయాలి’ అని గావస్కర్ పేర్కొన్నారు. -
4 బంతుల్లో 3 వికెట్లు.. మళ్లీ చాహర్ మెరుపులు
తిరువనంతపురం: ఆదివారం అంతర్జాతీయ టి20లో హ్యాట్రిక్... మంగళవారం మూడు బంతుల్లో (వైడ్‌ను మినహాయించి) మూడు వికెట్లు... ఇప్పుడు గురువారం మళ్లీ అదే తరహా ప్రదర్శన! పేసర్ దీపక్ చాహర్ జోరు కొనసాగుతూనే ఉంది. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన చాహర్ నాలుగు బంతుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో మొదటి, మూడో, నాలుగో బంతులకు చాహర్‌కు ఈ 3 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా యూపీ 9 వికెట్లకు 164 పరుగులు చేయగా, రాజస్తాన్ 17.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. -
చాంపియన్ కర్ణాటక
ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్లో మహారాష్ట్ర, కర్ణాటక జట్లు ఫైనల్ దాకా అజేయమైన ఫలితాల్ని సాధించాయి. చివరకు ఫైనల్ ముగిసేదాకా అజేయంగా నిలిచింది మాత్రం కర్ణాటక. సమవుజ్జీల మధ్య జరిగిన అంతిమ సమరంలో కర్ణాటక జయభేరి మోగించి టి20 జాతీయ చాంపియ గా నిలిచింది. ఇండోర్: మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 85 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో కర్ణాటకకు ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. గురువారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రపై ఘనవిజయం సాధించింది. మొదట మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. నౌషాద్ షేక్ (41 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. కర్ణాటక బౌలర్ మిథున్(2/24) మెరుగ్గా బౌలింగ్ చేశాడు. తర్వాత కర్ణాటక 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. రోహ కదమ్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. మయాంక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రాణించిన నౌషాద్ టాస్ నెగ్గిన కర్ణాటక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్రకు రాహుల్ త్రిపాఠి (30; 3 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (12) ఓ మోస్తరు ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరితో పాటు విజయ్ జోల్ (8) కూడా ఔట్ కావడంతో మహారాష్ట్ర రన్‌రేట్ 10 ఓవర్లదాకా ఆరు పరుగులను మించలేకపోయింది. నౌషద్ షేక్ ధాటిగా ఆడటంతో ఆ తర్వాత మహారాష్ట్ర స్కోరులో వేగం పుంజుకుంది. అతను అంకిత్ బావ్నే (29; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. చివరిదాకా క్రీజులో ఉండి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. కరియప్ప, సుచిత్ చెరో వికెట్ తీశారు. నడిపించిన రోహ , మయాంక్ అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కర్ణాటక 14 పరుగుల వద్దే ఓపెనర్ శరత్ (2) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో వికెట్ కోల్పోయేలోగానే మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. ఓపెనర్ రోహన్ కదమ్‌కు జతయిన మయాంక్ కర్ణాటకను వేగంగా నడిపించాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఈ జోడీ తేలిగ్గా ఆడేసింది. దీంతో ఓవర్‌కు సగటున 8 పరుగులు సాధిస్తూ లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో మొదట రోహన్, ఆ తర్వాత మయాంక్ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రోహన్ నిష్క్రమణ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (8 నాటౌట్) అండతో మయాంక్ చెలరేగాడు. దీంతో మరో 9 బంతులు మిగిలుండగానే కర్ణాటక విజయాన్ని అందుకుంది. సమద్ ఫలా, దివ్యాంగ్ చెరో వికెట్ తీశారు. -
ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ఢిల్లీ
కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్లో ఢిల్లీ 41 పరుగులతో రాజస్తాన్‌పై నెగ్గింది. తొలుత ఢిల్లీ 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఉన్ముక్త్ చంద్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గంభీర్ (23 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం రాజస్తాన్ 19.1 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. -
సత్తా చాటేందుకు సీనియర్లు సిద్ధం
కోల్‌కతా: ఐపీఎల్–11 వేలానికి ముందు సీనియర్ క్రికెటర్లతో పాటు, యువ కెరటాలు సత్తా చాటేం దుకు సన్నద్ధమయ్యారు. నేటినుంచి జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సూపర్ లీగ్ దశలో పలువురు అగ్రశ్రేణి, వర్ధమాన క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్లో గత జట్లు తమను కొనసాగించకపోవడంతో యువరాజ్, గంభీర్, హర్భజన్‌వంటి సీనియర్లు వేలంలోకి వస్తున్నారు. వీరందరూ ఈ టోర్నీలో చెలరేగి ఫ్రాంచైజీల దృష్టిలో పడాలని చూస్తున్నారు. ఇక యువ ఆటగాళ్లలో ఇటీవల 32 బంతుల్లో సెంచరీ సాధించిన రిషభ్ పంత్‌పై మరో సారి అందరి దృష్టి నిలిచింది. నేటి నుంచి కోల్‌కతా వేదికగా జరుగనున్న ఈ టోర్నీ సూపర్ లీగ్‌లో 10 జట్లు రెండు గ్రూపులుగా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో బరిలో దిగనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో పంజాబ్, కర్ణాటక, జార్ఖండ్, ముంబై, రాజస్తాన్; గ్రూప్ ‘బి’లో ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, బరోడా, ఉత్తరప్రదేశ్ జట్లు ఉన్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో తమిళనాడుతో ఢిల్లీ, బరోడాతో బెంగాల్, కర్ణాటకతో పంజాబ్, జార్ఖండ్‌తో ముంబై తలపడనున్నాయి. -
చాంపియన్ ఈస్ట్ జోన్
ముస్తాక్ అలీ టి20 టోర్నీ ముంబై: తొలిసారి ఇంటర్ జోనల్ ఫార్మాట్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఈస్ట్ జోన్ జట్టు చాంపియన్ గా అవతరించింది. ఐదు జోన్ ల (సౌత్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్) మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ ఆడిన నాలుగు మ్యాచ్‌లో్లనూ గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మనోజ్ తివారీ సారథ్యంలోని ఈస్ట్ జోన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో వెస్ట్ జోన్ జట్టును ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 149 పరుగులు చేసింది. షెల్డన్ జాక్సన్ (44 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 150 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి అధిగమించింది. విరాట్ సింగ్ (34 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాంక్ జగ్గీ (30 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించి ఈస్ట్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓటమితో ముగించిన సౌత్ జోన్ మరోవైపు సెంట్రల్ జోన్ తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో సౌత్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచి, మిగతా మూడింటిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 181 పరుగులు చేయగా... సెంట్రల్ జోన్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 184 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. చివరి ఓవర్లో సెంట్రల్ జట్టు విజయానికి నాలుగు పరుగులు అవసరమయా్యయి. సెంట్రల్ జట్టు టాప్ స్కోరర్ హర్‌ప్రీత్ సింగ్ (51 బంతుల్లో 92; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివరి ఓవర్ తొలి బంతికి అవుటైనా... అమిత్ మిశ్రా (5 బంతుల్లో 13 నాటౌట్), అంకిత్ రాజ్‌పుత్ (4 బంతుల్లో 5 నాటౌట్) ఒత్తిడికి లోనుకాకుండా సెంట్రల్ జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. -
సౌత్‌జోన్ కు తొలి విజయం
ముస్తాక్ అలీ టి20 టోర్నీ ముంబై: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు రెండు వరుస పరాజయాల తర్వాత విజయాల బోణీ చేసింది. గురువారం ఇక్కడి వాంఖెడే స్టేడియంలో వెస్ట్‌జోన్ తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. దీపక్ హుడా (21 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆదిత్య తారే (19 బంతుల్లో 26; 4 ఫోర్లు), ఇర్ఫాన్ పఠాన్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించారు. సౌత్‌జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 3 వికెట్లతో చెలరేగగా... రాహిల్ షా, ఎం. అశ్విన్ , విజయ్ శంకర్ తలా రెండు వికెట్లు పడగొటా్టరు. అనంతరం సౌత్‌జోన్ జట్టు 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... విష్ణు వినోద్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. వెస్ట్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ , శౌర్య, ఈశ్వర్, ప్రవీణ్ తాంబే తలా ఓ వికెట్ తీశారు. మరో మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ జట్టు 8 వికెట్ల తేడాతో నార్త్‌జోన్ ను చితు్తగా ఓడించింది. యువరాజ్‌సింగ్ (24 బంతుల్లో 38; 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గౌతమ్ గంభీర్ (13 బంతుల్లో 20; 4 ఫోర్లు), శిఖర్ ధావన్ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్‌జోన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం యువ బ్యాట్స్‌మన్ విరాట్ సింగ్ (48 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మనోజ్ తివారి (43 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో ఈస్ట్‌జోన్ జట్టు 16.3 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. వీరిద్దరూ 87 బంతులో్లనే 149 పరుగులు జతచేసి ఈస్ట్‌ను గెలిపించారు.