సౌత్‌జోన్ కు తొలి విజయం
ముస్తాక్ అలీ టి20 టోర్నీ
ముంబై: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు రెండు వరుస పరాజయాల తర్వాత విజయాల బోణీ చేసింది. గురువారం ఇక్కడి వాంఖెడే స్టేడియంలో వెస్ట్‌జోన్ తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. దీపక్ హుడా (21 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్.
ఆదిత్య తారే (19 బంతుల్లో 26; 4 ఫోర్లు), ఇర్ఫాన్ పఠాన్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించారు. సౌత్‌జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 3 వికెట్లతో చెలరేగగా... రాహిల్ షా, ఎం. అశ్విన్ , విజయ్ శంకర్ తలా రెండు వికెట్లు పడగొటా్టరు. అనంతరం సౌత్‌జోన్ జట్టు 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... విష్ణు వినోద్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. వెస్ట్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ , శౌర్య, ఈశ్వర్, ప్రవీణ్ తాంబే తలా ఓ వికెట్ తీశారు.
మరో మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ జట్టు 8 వికెట్ల తేడాతో నార్త్‌జోన్ ను చితు్తగా ఓడించింది. యువరాజ్‌సింగ్ (24 బంతుల్లో 38; 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గౌతమ్ గంభీర్ (13 బంతుల్లో 20; 4 ఫోర్లు), శిఖర్ ధావన్ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్‌జోన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది.
అనంతరం యువ బ్యాట్స్‌మన్ విరాట్ సింగ్ (48 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మనోజ్ తివారి (43 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో ఈస్ట్‌జోన్ జట్టు 16.3 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. వీరిద్దరూ 87 బంతులో్లనే 149 పరుగులు జతచేసి ఈస్ట్‌ను గెలిపించారు.