
బౌలర్‌గా ఎన్నో రికార్డులను సృష్టించాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. బాల్‌తోనే కాదు సిక్సులు బాది బ్యాట్‌తో కూడా సమాధానం చెప్పే బజ్జీ పుట్టిన రోజు నేడు. అయన నటుడిగా తెరంగేట్రం చేస్తున్న ‘ఫ్రెండ్షిష్’ చిత్ర బృందం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘అరిచి అరగదీయమ్మ’ అనే సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తుండడం విశేషం. ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్. బాలాజీ నిర్మిస్తున్నాడు.
ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్‌గా, తమిళ బిగ్ బాస్ విన్నర్, మాజీ 'మిస్ శ్రీలంక' 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తుస్తోంది. 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో ఆవిష్కరించగా భారీ స్పందన దక్కింది. త్వరలోనే ఈ మూవీ రామోజీ ఫిలిం సిటీలో ఓ పాట, ఫైట్ సన్నివేశాల షూటింగ్‌ను జరుపుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment