టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హ్యండ్స్‌కాంబ్ వికెట్ పడగొట్టిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 19 టెస్టులు ఆడిన అశ్విన్ 97 వికెట్లు సాధించాడు. ఇక ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ పేరిట ఉండేది.ఆస్ట్రేలియాపై హర్భజన్ 95 టెస్టు వికెట్లు పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌తో హర్భజన్ సింగ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఇప్పటి వరకు 8 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లతో రాణించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించాడు.
విజయం దిశగా భారత్
అయితే తొలి టెస్టులో భారీ విజయం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్(12), పాట్ కమ్మిన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఆసీస్ కోల్పోయిన 7 వికెట్లలో ఐదు వికెట్లు కూడా అశ్విన్ పడగొట్టనివే కావడం విశేషం. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైన భారత్.. ఆసీస్ ముందు 223 పరుగుల ఆధిక్యాన్ని నిలిపింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
The moment Ravi Ashwin Picked his 31st 5-wicket haul in Test cricket - One of the greatest of all time. pic.twitter.com/2LVzWCDOTP
— CricketMAN2 (@ImTanujSingh) February 11, 2023
చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment