Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి ఈ సీజన్‌లో వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రుత్‌రాజ్ కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించాడు. కాగా రుత్‌రాజ్ ఆడిన మూడు సీజన్ల తొలి మూడు మ్యాచ్‌ల్లోను దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2020లో అరంగేట్రం చేసిన అతడు తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.
అదే విధంగా గతేడాది సీజన్‌లోను తొలి మూడు మ్యాచ్‌ల్లో 20 పరుగులు సాధించాడు. గైక్వాడ్ ప్రతీ సీజన్‌లో నాల్గువ మ్యాచ్ నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో రుత్‌రాజ్ గైక్వాడ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రతీ సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు రుత్‌రాజ్ విశ్రాంతి ఇవ్వాలని సీఎస్‌కేకు హార్భజన్ సలహా ఇచ్చాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌తో గైక్వాడ్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని హర్భజన్ థీమా వ్యక్తం చేశాడు.
నేను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో భాగమై ఉంటే... "గైక్వాడ్‌ను తొలి మూడు మ్యాచ్‌లకు గైక్వాడ్‌కు విశ్రాంతిని ఇచ్చేవాడిని. అతడిని నేరుగా నాలుగో మ్యాచ్‌కు అవకాశం ఇచ్చేవాడిని. ఎందకుంటే గైక్వాడ్ ప్రతీ సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లోను విఫలమవుతాడన్న విషయం తెలిసిందే. కాబట్టి అతడి స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం ఇస్తే సీఎస్‌కే విజయం సాధిస్తుంది. అయితే అతడు అద్భుతమైన ఆటగాడు.
అతడి ఫామ్‌లో రావడం సీఎస్‌కేకు చాలా ముఖ్యం. కాబట్టి అతడు ఫామ్‌లోకి రావాలి అని ఆశిద్దాం. ఇక సీఎస్కే బౌలింగ్ విభాగంలో సరైన లెగ్‌స్పిన్నర్ లేడు. గతంలో ఇమ్రాన్ తాహిర్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టేవాడు. రవీంద్ర జడేజాతో కలిసి బౌలింగ్ చేయగల సరైన స్పిన్నర్ కావాలి" అని హార్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక శనివారం సన్‌రైజెర్స్ హైదరాబాద్‌తో సీఎస్‌కే తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment