IPL 2022 GT Vs CSK: Twitter Lauds Ruturaj Gaikwad Over His Half Century After Five Consecutive Failures - Sakshi
Sakshi News home page

IPL 2022 CSK Vs GT: "వెల్‌క‌మ్ బ్యాక్ రుత్‌రాజ్.. అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడావు"

Published Mon, Apr 18 2022 10:25 AM | Last Updated on Thu, Jun 9 2022 7:14 PM

Twitter lauds Ruturaj Gaikwad as CSK batter hits half century after five consecutive failures - Sakshi

PC: IPL

ఐపీఎల్‌-2022లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఎట్ట‌కేల‌కు ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఆదివారం(ఏప్రిల్ 17) గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుత‌మైన అర్ధ సెంచ‌రీ సాధించి సీఎస్‌కే భారీ స్కోర్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 73 ప‌రుగులు గైక్వాడ్ సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి.

ఈ క్ర‌మంలో రుత్‌రాజ్ గైక్వాడ్‌పై ట్విట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. "వెల్‌క‌మ్ బ్యాక్ రుత్‌రాజ్, అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడావు" అని ఓ యూజ‌ర్ రాసుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. చెన్నైసూప‌ర్ కింగ్స్‌పై మూడు వికెట్ల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఒకే ఒక విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement