![Harbhajan Singh picks his alltime T20 XI MS Dhoni to lead - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/7/MA-DHOIN.jpg.webp?itok=IG5wXuIy)
Harbhajan Singh’s All-Time T20 Playing XI : భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఆల్ టైమ్ టీ20 ఫ్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు . తను ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. అదే విధంగా.. యూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌కు మూడో స్ధానంలో, ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వాట్సన్‌కు నాలుగో స్ధానంలో చోటు దక్కింది.
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు ఐదో స్థానంలో అవకాశం ఇచ్చాడు. ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా హర్భజన్ ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్‌కు చోటు కల్పించాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా సునీల్ నరైన్‌ను ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా,లసిత్ మలింగకు తన జట్టులో హర్భజన్ సింగ్ స్థానం కల్పించాడు. కాగా హర్భజన్ సింగ్ ప్రకటించిన ఈ జట్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లికు స్ధానం దక్కకపోవడం గమనార్హం.
హర్భజన్ T20 XI: రోహిత్ శర్మ, క్రిస్ గేల్, జోస్ బట్లర్, షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్, ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment