టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023కు సన్నద్దమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో రెండు వన్డేల దూరంగా ఉన్న కోహ్లి.. రాజ్‌కోట్ వేదికగా జరిగే ఆఖరి వన్డేకు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. ఆసియాకప్-2023లో పాకిస్తాన్‌పై అద్భుత శతకంతో చెలరేగిన కింగ్ కోహ్లి.. వరల్డ్‌కప్‌లోనూ అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు.
ఈ క్రమంలో విరాట్‌ను ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ ఏడాది వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకుంటే కోహ్లి వైట్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెట్ ప్రకటించే ఛాన్స్ ఉందని ఏబీడీ బాంబు పేల్చాడు. వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడనికి కోహ్లికి ఇదే సరైన సమయమని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
"కోహ్లి సౌతాఫ్రికా (2027 వరల్డ్ కప్ కోసం)కు రావడానికి ఇష్టపడతాడని నాకు తెలుసు. కానీ అది చాలా కష్టం. ఎందుకంటే 2027 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ముందు 2023 ప్రపంచకప్‌పై దృష్టిపెడదాం. బహుశా విరాట్ కోహ్లి కూడా అదే చెప్పవచ్చు. ఇక భారత్ వరల్డ్‌కప్ గెలిస్తే.. కోహ్లి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది.
అందరికి ధన్యవాదాలు. ఇక నుంచి నేను టెస్టు క్రికెట్, ఐపీఎల్ మాత్రమే ఆడతాను. నా కెరీర్ చివరి రోజులను ఎంజాయ్ చేస్తాను. కుటంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. మీ అందరికీ గుడ్ బై చెబుతాను అని కోహ్లి చెప్పొచ్చు. కానీ కోహ్లి ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడు ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మరి కొన్నాళ్లపాటు ఆడాలని కూడా కోహ్లి భావించవచ్చు" అని యూట్యూబ్ ఛానల్‌లో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి గత కొంత కాలంగా భారత తరపున వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు.
చదవండి: World Cup 2023: భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు!
Comments
Please login to add a commentAdd a comment