చంద్రయాన్‌-3 సక్సెస్‌.. ఈ సారి వరల్డ్‌కప్‌ టీమిండియాదే! ఎలా అంటే? | In 2019, Chandrayaan 2 Landing Failed And India Could Not Win World Cup - Sakshi
Sakshi News home page

World Cup 2023: చంద్రయాన్‌-3 సక్సెస్‌.. ఈ సారి వరల్డ్‌కప్‌ టీమిండియాదే! ఎలా అంటే?

Published Thu, Aug 24 2023 12:43 PM | Last Updated on Tue, Oct 3 2023 7:06 PM

In 2019, Chandrayaan 2 Landing Failed And India Could Not Win World Cup - Sakshi

చంద్రయాన్ -3 విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. జాబిలిపై భారత పతాకం రెపాలపలడింది. చంద్రుడి దక్షిణ దృవంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్ -3 సూపర్‌ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ ఘనత సాధించినందుకు ప్రతీ భారతీయుడు గర్వంగా ఫీలవుతున్నారు. ఇక చంద్రయాన్ -3 విజయంపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తి కలిగిస్తోంది. 

ట్విట్‌లో ఏముందంటే?
2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 విఫలమైన సంగతి తెలిసిందే. చివరి క్షణంలో సాంకేతిక సమస్యలు తలతెత్తడంతో చంద్రయాన్‌-2 చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు దేశ ప్రజలందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అదే ఏడాది భారత క్రికెట్‌ జట్టు కూడా 2019 వన్డే ప్రపంచకప్‌లో తీవ్ర నిరాశపరిచింది.

ఈ మెగా టోర్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టింది. దీంతో ఒకేడాది భారత్‌కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే యాదృచ్చికంగా చంద్రయాన్‌-3, వన్డే ప్రపంచకప్‌ సరిగ్గా మళ్లీ ఒకే ఏడాది షెడ్యూల్‌ చేయబడ్డాయి. ఈ క్రమంలో చంద్రయాన్‌ 3 విజయవంతం కావడంతో.. భారత జట్టు కూడా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంటుందని ఆర్ధం వచ్చేలా ముంబై ఇండియన్స్‌ ట్వీట్‌ చేసింది.

ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి​ంది. కాగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ భారత్‌ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఆక్టోబర్‌5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ షురూ కానుంది.
చదవండి: హార్దిక్‌, బుమ్రా కాదు.. టీమిండియా ఫ్యూచర్‌ కెప్టెన్‌ అతడే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement