ICC ODI World Cup 2023: 1987, 1999, 2003, 2007, 2015... ఏకంగా ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ గెలిచిన ఘనత ఆస్ట్రేలియా సొంతం. పటిష్టమైన కంగారూ జట్టుతో పోటీ అంటే ప్రత్యర్థి జట్లకు ఒకప్పుడు వణుకుపుట్టేది! కానీ గత కొన్నాళ్లుగా ఆసీస్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో సెమీస్‌లోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో మాదిరి ఆస్ట్రేలియా పటిష్ట జట్టుగా కనిపించడం లేదని పేర్కొన్నాడు. అయితే, వన్డే వరల్డ్‌కప్-2023లో టాప్-4కు చేరితే మాత్రం వారిని ఆపడం కష్టమని ఇతర జట్లకు వార్నింగ్ ఇచ్చాడు.
మునుపటిలా లేదు.. కానీ
‘‘ఆస్ట్రేలియా ఇంతకు ముందున్నట్లు లేదు. వాళ్లు ఇంతవరకు మెగా టోర్నీలో ఆడే తమ వికెట్ కీపర్‌ను ఫైనల్ చేయలేదు. జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ ఇద్దరూ మంచి ఆటగాళ్లే. కానీ ఇద్దరిలో ఒక్కరికే చోటు దక్కుతుంది. మాక్స్‌వెల్ వికెట్లు తీస్తున్నాడు. కానీ.. జట్టు అతడి నుంచి బ్యాటింగ్ మెరుపులు ఆశిస్తోంది.
స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆసీస్ బ్యాటర్లు తడబడటం ఆందోళన కలిగించే అంశం. ఇక కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టొయినిస్ పోషించాల్సిన పాత్రలేమిటో కూడా ఇంతవరకు స్పష్టం కాలేదు. నిజానికి గ్రీన్ కంటే స్టొయినిస్ బెటర్. లోయర్ ఆర్డర్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు. నా వరకైతే ఈ జట్టు బాగానే అనిపిస్తోంది.
ఫైనల్ ఫోర్ జట్లలో ఆస్ట్రేలియా కూడా ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ ఆసీస్‌ను సెమీస్‌కు చేర్చగలరు.
ఒక్కసారి సెమీస్ చేరితే ఆపడం కష్టం
ఒక్కసారి టాప్-4లో అడుగుపెడితే నాకౌట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అత్యంత ప్రమాదకారిగా మారి ప్రత్యర్థి జట్లకు సవాల్ విసరడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా గతేడాది సొంతగడ్డపై జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇక తాజా ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికాతో 2-3తో.. టీమిండియాతో 2-1తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. కాగా అక్టోబరు 8న రోహిత్ సేనతో మ్యాచ్‌తో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్-2023 ప్రయాణాన్ని ఆరంభించనుంది.
చదవండి: కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. మోస్ట్ డేంజరస్: పాక్ వైస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment