ఆఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం అద్బతమైన ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. కాగా బంగ్లాదేశ్‌పై ఆఫ్గాన్‌కు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. ఛటోగ్రామ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అయితే బంగ్లాను ఏకంగా 142 పరుగుల తేడాతో ఆఫ్గాన్ చిత్తు చేసింది.
ఈ సిరీస్‌లో ఆఖరి వన్డే ఛటోగ్రామ్ వేదికగా మంగళవారం జరగనుంది. ఇక బంగ్లాదేశ్‌ను వారి సొంత గడ్డపై చిత్తు చేసిన ఆఫ్గాన్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియాపై చోప్రా విమర్శలు గుప్పించాడు. కాగా గత డిసెంబర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఆ సమయంలో భారత జట్టుపై విమర్శల వర్షం కురిసింది.
ఇక తాజాగా ఇదే విషయాన్ని చోప్రా మరోసారి తన యూట్యూబ్‌లో ఛానల్‌లో చర్చించాడు. "బంగ్లాదేశ్‌కు వారి స్వదేశంలోనే ఆఫ్ఘనిస్థాన్ చుక్కలు చూపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ ఎగరేసుకుపోయింది. ఆఫ్గాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా వారి స్పిన్నర్లు గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. స్పిన్నర్లు నిలకడగా రాణిస్తారు.
కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాటింగ్ పరంగా దుమ్మురేపుతున్నారు. ఆఫ్గాన్ తమ ఉపఖండ పరిస్ధితులకు బాగా అలవాటు పడింది. కాబట్టి ఈ ఏడాది భారత్ వేదికగా ప్రపంచకప్‌లో కూడా ఆఫ్గాన్ జట్టు నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఆఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేస్తే.. అది వారికే ప్రమాదం" అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
ఇక టీమిండియా గురించి మాట్లాడుతూ.. "ఇదే బంగ్లాదేశ్‌లో భారత జట్టు మాత్రం సిరీస్‌ను కోల్పోయింది. అయితే కీలక మ్యాచ్‌లో రోహిత్ గాయ పడటంతో సిరీస్ కోల్పోయిందన్న విషయం మర్చిపోకూడదు. కానీ మూడో వన్డేలో మాత్రం ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. అయితే గెలవాల్సిన సిరీస్‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది అని చోప్రా చెప్పుకొచ్చాడు.
చదవండి: ODI World Cup 2023: ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే?
Comments
Please login to add a commentAdd a comment