అనూహ్య ఎంపికలు, సంచలనంలాంటివేమీ లేవు... అంచనాలకు తగినట్లుగానే సొంతగడ్డపై టీమిండియా బృందం సిద్ధమైంది... ఆసియా కప్ బరిలో నిలిచిన 17 మందిలో ఇద్దరిని తప్పించి వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేస్తామన్న సెలక్టర్లు దానికే కట్టుబడ్డారు.
కొత్తగా మరో ఆటగాడిని తీసుకొని జట్టులోకి చేర్చే ప్రయత్నం చేయలేదు... గాయం నుంచి కోలుకోవడంలో రాహుల్ ఎంపిక ఖాయం కాగా, రిజర్వ్‌గా ఉన్న సంజూ సామ్సన్ పేరును పరిశీలించనే లేదు... ఊహించినట్లుగానే తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ తమ స్థానాలు కోల్పోయారు. సరిగ్గా పుష్కర కాలం తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ వన్డే వరల్డ్ కప్‌లో 2011 తరహాలోనే మన బృందం మళ్లీ మ్యాజిక్ చేస్తుందా అనేది ఆసక్తికరం.
పల్లెకెలె (శ్రీలంక): వన్డే క్రికెట్‌లో రెండు సార్లు జగజ్జేతగా నిలిచిన భారత జట్టు సొంతగడ్డపై మూడో టైటిల్ కోసం గురి పెట్టింది. టీమిండియాకు అలాంటి ఘనతను అందించే సత్తా ఉన్న 15 మందితో ఇప్పుడు జట్టు సిద్ధమైంది.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం పల్లెకెలెలో ఈ జాబితాను ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ఈ బృందంలో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నారు.
ఆసియా కప్‌లో ప్రస్తుతం టీమ్‌లో ఉన్న హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ, పేసర్ ప్రసిధ్ కృష్ణ, రిజర్వ్‌గా ఉన్న సంజూ సామ్సన్‌లకు మాత్రం అవకాశం దక్కలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వరల్డ్ కప్ కోసం జట్లను ప్రకటించేందుకు ఆఖరి తేదీగా ప్రకటించిన సెప్టెంబర్ 5నే అన్ని టీమ్‌లూ తమ బృందంతో సిద్ధమయ్యాయి.
ఆరోజే ఆఖరి తేది
అయితే ఎవరికైనా గాయం లేదా ఇతర కారణాలతో జట్టులో మార్పులు చేయాల్సి ఉంటే సెప్టెంబరు 28 వరకు కూడా అవకాశం ఉంది. ఆసియా కప్ తర్వాత వరల్డ్ కప్‌కు ముందు భారత్ ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది.
రోహిత్ తొలిసారి కెప్టెన్‌గా
2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన 8 మంది ఈసారి కూడా టీమ్‌లో ఉండటం విశేషం. 2011 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కని రోహిత్ శర్మ తర్వాతి రెండు టోర్నీల్లో ఆడాడు. గత వరల్డ్ కప్‌లో ఏకంగా ఐదు సెంచరీలతో అదరగొట్టిన అతను ఈసారి సొంతగడ్డపై సారథిగా పెద్ద బాధ్యతతో బరిలోకి దిగుతున్నాడు.
ఒకే ఒక్కడు
2011 విజయంలో భాగమైన విరాట్ కోహ్లి ప్రస్తుత టీమ్‌లో వన్డే వరల్డ్ గెలిచిన ఒకే ఒక ఆటగాడు. గిల్, శ్రేయస్, సూర్య, కిషన్, అక్షర్, శార్దుల్, సిరాజ్‌లకు ఇదే తొలి ప్రపంచకప్. తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కొంటుంది.
రోహిత్ శర్మ
వయసు: 36
ఆడిన వన్డేలు: 246
చేసిన పరుగులు: 9922
అత్యధిక స్కోరు: 264
సెంచరీలు: 30
అర్ధ సెంచరీలు: 49
తీసిన వికెట్లు: 8
హార్దిక్ పాండ్యా
వయసు: 29
ఆడిన వన్డేలు: 79
చేసిన పరుగులు: 1753
అత్యధిక స్కోరు: 92
అర్ధ సెంచరీలు: 11
తీసిన వికెట్లు: 74
బెస్ట్ బౌలింగ్: 4/24
విరాట్ కోహ్లి
వయసు: 34
ఆడిన వన్డేలు: 277
చేసిన పరుగులు: 12902
అత్యధిక స్కోరు: 183
సెంచరీలు: 46
అర్ధ సెంచరీలు: 65
తీసిన వికెట్లు: 4
రవీంద్ర జడేజా
వయసు: 34
ఆడిన వన్డేలు: 179
చేసిన పరుగులు: 2574
అత్యధిక స్కోరు: 87
అర్ధ సెంచరీలు: 13
తీసిన వికెట్లు: 197
బెస్ట్ బౌలింగ్: 5/36
బుమ్రా
వయసు: 29
ఆడిన వన్డేలు: 73
తీసిన వికెట్లు: 121
బెస్ట్ బౌలింగ్: 6/19
ఇన్నింగ్స్‌లో 5
వికెట్లు: 2
చేసిన పరుగులు: 63
అత్యధిక స్కోరు: 16
సిరాజ్
వయసు: 29
ఆడిన వన్డేలు: 26
తీసిన వికెట్లు: 46
బెస్ట్ బౌలింగ్: 4/32
ఇన్నింగ్స్‌లో 4
వికెట్లు: 2
చేసిన పరుగులు: 31
అత్యధిక స్కోరు: 9
ఇషాన్ కిషన్
వయసు: 25
ఆడిన వన్డేలు: 19
చేసిన పరుగులు: 776
అత్యధిక స్కోరు: 210
సెంచరీలు: 1
అర్ధ సెంచరీలు: 7
క్యాచ్‌లు/స్టంపింగ్: 11/2
కుల్దీప్ యాదవ్
వయసు: 28
ఆడిన వన్డేలు: 86
తీసిన వికెట్లు: 141
బెస్ట్ బౌలింగ్: 6/25
ఇన్నింగ్స్‌లో 5
వికెట్లు: 1
చేసిన పరుగులు: 168
అత్యధిక స్కోరు: 19
శార్దుల్ ఠాకూర్
వయసు: 31
ఆడిన వన్డేలు: 40
తీసిన వికెట్లు: 59
ఇన్నింగ్స్‌లో 4
వికెట్లు: 4
బెస్ట్ బౌలింగ్: 4/37
చేసిన పరుగులు: 318
అత్యధిక స్కోరు: 50
శ్రేయస్ అయ్యర్
వయసు: 28
ఆడిన వన్డేలు: 44
చేసిన పరుగులు: 1645
అత్యధిక స్కోరు: 113
సెంచరీలు: 2
అర్ధ సెంచరీలు: 14
క్యాచ్‌లు: 16
శుబ్‌మన్ గిల్
వయసు: 23
ఆడిన వన్డేలు: 29
చేసిన పరుగులు: 1514
అత్యధిక
స్కోరు: 208
సెంచరీలు: 4
అర్ధ సెంచరీలు: 7
క్యాచ్‌లు: 18
షమీ
వయసు: 33
ఆడిన వన్డేలు: 91
తీసిన వికెట్లు: 163
బెస్ట్ బౌలింగ్: 5/69
ఇన్నింగ్స్‌లో 4
వికెట్లు: 9
చేసిన పరుగులు: 204
అత్యధిక స్కోరు: 25
అక్షర్ పటేల్
వయసు: 29
ఆడిన వన్డేలు: 52
తీసిన వికెట్లు: 58
బెస్ట్ బౌలింగ్: 3/24
చేసిన పరుగులు: 413
అత్యధిక స్కోరు:
64 నాటౌట్
అర్ధ సెంచరీలు: 2
సూర్యకుమార్ యాదవ్
వయసు: 32
ఆడిన వన్డేలు: 26
చేసిన పరుగులు: 511
అత్యధిక
స్కోరు: 64
అర్ధ సెంచరీలు: 2
క్యాచ్‌లు: 15
కేఎల్ రాహుల్
వయసు: 31
ఆడిన వన్డేలు: 54
పరుగులు: 1986
అత్యధిక స్కోరు: 112
సెంచరీలు: 5
అర్ధ సెంచరీలు: 13
క్యాచ్‌లు/స్టంపింగ్: 32/2
Comments
Please login to add a commentAdd a comment