టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇద్దరు యువ క్రికెటర్ల కోసం బీసీసీఐని అభ్యర్ధించాడు. ఐపీఎల్-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న కేకేఆర్ రింకూ సింగ్, రాజస్థాన్ యశస్వి జైస్వాల్‌లను లేట్ చేయకుండా టీమిండియాలోకి తీసుకోవాలని భజ్జీ కోరాడు. ఇప్పటికిప్పుడు రింకూ, యశస్విలను నేరుగా ఫైనల్ ఎలెవెన్‌లో (టీమిండియా) ఆడించాలని కోరడం లేదని, వారిని జట్టుకు దగ్గరగా తీసుకెళ్లాలన్నదే తన విజ్ఞప్తి అని తెలిపాడు. వారిరువురికి ప్రస్తుతమున్న ఫామ్‌లో అవకాశాలు కల్పిస్తే సత్తా చాటుతారని, సెలెక్టర్లు వేచి చూసే ధోరణిని అవలంభిస్తే, అది వారితో పాటు టీమిండియాకు కూడా నష్టంగా పరిణించబడుతుందని అభిప్రాయపడ్డాడు.
ఆటగాళ్లు రాణిస్తున్నప్పుడు వారిని వ్యవస్థలో భాగం చేయాలని, నేరుగా వారిని తుది జట్టులో ఆడించకపోయినా, జట్టుకు దగ్గర చేస్తే ఖచ్చితంగా వారు తమలోని టాలెంట్‌ను మరింత మెరుగపర్చుకుంటారని అన్నాడు. కాగా, ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా ఆటగాళ్లు టీమిండియా తలుపులు తట్టడం ఇది కొత్తేమీ కాదు. సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లు సైతం ఇదే వేదికగా వెలుగులోకి వచ్చి నేడు టీమిండియాలో సుస్థిర స్థానాలు సంపాదించుకున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న కొద్ది మంది ఆటగాళ్లను మాజీలు, విశ్లేషకులు టీమిండియాకు రెకమెండ్ చేస్తున్నారు. వారిలో అత్యధిక భాగం రింకూ, యశస్విలను మద్దతు పలుకుతున్నారు. ఐపీఎల్ ప్రదర్శన కారణంగానే అజింక్య రహానే భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించడంతో ఈ వేదికపై సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని చాలామంది యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. వీరితో యశస్వి జైస్వాల్ (13 మ్యాచ్‌ల్లో 575 పరుగులు), రింకూ సింగ్ (13 మ్యాచ్‌ల్లో 407 పరుగులు) ముందువరుసలో ఉన్నారు.
చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్ సీరియస్ అయ్యాడు: సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment