Harbhajan: Rinku is the Fondest Player of the Team Even SRK Considers Him Like Son - Sakshi
Sakshi News home page

#Rinku Singh- Shah Rukh Khan: ‘రింకూ నా కుమారుడి లాంటివాడు’; అతడంటే అందరికీ ఇష్టమన్న భజ్జీ! ఎందుకంటే..

Published Mon, Apr 10 2023 5:02 PM | Last Updated on Mon, Apr 10 2023 5:26 PM

Harbhajan: Rinku is Fondest Player Of Team Even SRK Considers Him Like Son - Sakshi

రింకూ సింగ్‌ (photo credit: KKR Twitter)

IPL 2023 GT Vs KKR- Rinku Singh: ‘‘రింకూ సింగ్‌ గురించి చాలా మందికి పూర్తిగా తెలియకపోవచ్చు. అయితే కేకేఆర్‌లో మాత్రం అతడు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన ఆటగాడు. తను ఎన్నో ఏళ్లుగా జట్టుతో కొనసాగుతున్నాడు. ప్రతిఒక్కరు అతడిని ఇష్టపడతారు.

గారాబం చేస్తారు. అంతెందుకు ఖాన్‌ సాబ్‌(షారుక్‌ ఖాన్‌) అయితే ఓ రోజు మాట్లాడుతూ.. ‘రింకూ నా కుమారుడి లాంటివాడు’’ అన్నాడు. అతడిపై అందరూ ఎందుకంత ప్రేమను కురిపిస్తారంటే.. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తన ఒంట్లోని ప్రతి రక్తపు బొట్టును.. అణువణువులో దాగున్న శక్తిని ధారబోస్తాడు’’ అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ రింకూ సింగ్‌ను ఆకాశానికెత్తాడు.

రింకూతో మామూలుగా ఉండదు
ఆట పట్ల రింకూ అంకితభావం అమోఘమంటూ కొనియాడాడు. కాగా డిపెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో రింకూ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మై బేబీ రింకూ
ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కేకేఆర్‌ సహ యజమాని షారుక్‌ ఖాన్‌ సైతం మై బేబీ రింకూ అంటూ ప్రేమను కురిపించాడు. ఇక కేకేఆర్‌ మాజీ ప్లేయర్‌ సైతం రింకూ ఇన్నింగ్స్‌ గురించి స్పందిస్తూ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడాడు.

‘‘అంతటి ఒత్తిడిలోనూ రింకూ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. కఠిన పరిస్థితుల్లో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం మామూలు విషయం కాదు. తను ఒక్క బంతిని మిస్‌ చేసినా.. మ్యాచ్‌ చేజారిపోయేది. కానీ తను అలా కానివ్వలేదు’’ అంటూ భజ్జీ ప్రశంసించాడు.

మనసులు గెలిచాడు
తన అద్భుత ఇన్నింగ్స్‌తో రింకూ అందరి మనసులు గెలిచాడని కొనియాడాడు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరి అత్యుత్తమ ప్లేయర్‌గా నిలుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా పేద కుటుంబానికి చెందిన రింకూ.. అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన లెఫ్టాండ్‌ బ్యాటర్‌ రింకూను కేకేఆర్‌ కొనుగోలు చేయగా.. ఐపీఎల్‌లో అతడికి అవకాశం వచ్చింది. 

చదవండి:  4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్‌.. కేకేఆర్‌ ట్వీట్‌ వైరల్‌! ఎవరీ యశ్‌ దయాల్‌?
IPL 2023: ఇంజక్షన్లు తీసుకున్నా.. అద్భుత ప్రభావం.. త్వరలోనే కలుస్తా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement