
స్టీవ్ స్మిత్ (PC: BCCI/ Twitter)
BGT 2023- India vs Australia, 3rd Test: ‘‘ఈ టెస్టు ఆసాంతం వాళ్లు అద్భుతంగా ఆడారు. ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియాలానే ఆడింది. వీళ్లు మొదటి రెండు టెస్టులు ఓడారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. కెప్టెన్ మారాడు.. వాళ్లు గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డారు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్మిత్ బృందంపై ప్రశంసలు కురిపించాడు.
అంచనాలు తలకిందులు
ఇండోర్‌లో టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆసీస్.. మూడో టెస్టులో మాత్రం అంచనాలు తలకిందులు చేసింది.
ఆ తర్వాత ఇదే రెండోసారి
ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వెళ్లగా.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్‌కు అదృష్టం కలిసివచ్చింది. 2017లో భారత గడ్డపై ఆసీస్‌కు తొలి విజయం అందించిన స్మిత్ సారథ్యంలోనే తాజా మ్యాచ్‌లోనూ జట్టు గెలవడంతో లక్కీ చార్మ్‌గా ఆసీస్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఇక స్మిత్ కెప్టెన్సీలో నాథన్ లియోన్ 11 వికెట్ల ప్రదర్శనకు తోడు ఉస్మాన్ ఖవాజా రాణించడంతో ఆస్ట్రేలియాకు ఈ విజయం సాధ్యమైన విషయం తెలిసిందే.
టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌రాగానే ఆసీస్ తలరాత మారిందన్నాడు. ‘‘స్మిత్ కెప్టెన్సీ అద్బుతంగా ఉంది.
స్పిన్నర్ల సేవలను అతడు పూర్తిగా వినియోగించుకున్నాడు. ఇండియా టాస్ గెలిచినప్పటికీ ఆస్ట్రేలియా ప్రతి సెషన్‌లోనూ అదరగొట్టింది. తమ అద్భుత బౌలింగ్‌తో తొలి రోజు నుంచే టీమిండియాపై ఒత్తిడి పెంచింది. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ఆధిపత్యం కొనసాగించింది’’ అని స్మిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.
చదవండి: IND vs AUS: వాళ్లిద్దరి వల్లే ఇలా! ఏదేమైనా పుజ్జీ భయపెట్టాడు.. సిరీస్ డ్రా చేసుకుంటాం: స్మిత్
Ind Vs Aus: వాళ్లేమో పరితపించిపోయారు.. మీరేమో ఇలా! అదే టీమిండియా కొంపముంచింది!
Comments
Please login to add a commentAdd a comment