T20 World Cup 2022- India Vs Pakistan- Predicted India Playing XI: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమవుతోంది. టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం (అక్టోబరు 23) ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ భారత తుది జట్టును అంచనా వేశాడు.
చిరకాల ప్రత్యర్థితో పోరులో ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్‌రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో రోహిత్ సేన బరిలోకి దిగాలని సూచించాడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బాధ్యత మరింత పెరిగిందన్న భజ్జీ.. అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించడం సానుకూల అంశమని పేర్కొన్నాడు.
నా తుది జట్టు ఇదే
ఈ మేరకు హర్భజన్ సింగ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండాలి. యుజీ చహల్‌కు కూడా వారితో పాటు చోటు దక్కాలి. ఇక అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు కూడా చోటు ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డాడు.
అదే విధంగా.. దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్‌లకు ఆరంభ మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాదని అభిప్రాయపడ్డాడు. ఇక అక్షర్ పటేల్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడిందన్న హర్భజన్ సింగ్.. టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్ విషయంలో అశ్విన్‌పై ఆధారపడలేమని.. అందుకే అతడికి అవకాశం రాకపోవచ్చని వ్యాఖ్యానించాడు. కాగా ఆర్పీ వర్సెస్ డీకే నేపథ్యంలో రిషభ్ పంత్‌ను కాదని అనువజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వైపే భజ్జీ మొగ్గుచూపడం విశేషం.
పాక్‌తో మ్యాచ్‌కు భజ్జీ ఎంచుకున్న జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
టీ20 వరల్డ్‌కప్-2022 బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
పాకిస్తాన్
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హారీస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్.
స్టాండ్‌బై ప్లేయర్స్: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ
చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్‌లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్‌లు.. పాక్‌తో మ్యాచ్ అంటేనే..
European T0 League: కిందా మీదా పడి చివరకు ఎలాగోలా!
Comments
Please login to add a commentAdd a comment