విరాట్ వీరోచిత పోరాటం కారణంగా నిన్న (అక్టోబర్ 23) పాక్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పొట్టి క్రికెట్ చరిత్రలో మరపురానిదిగా మిగిలిపోయే ఈ సమరంలో ఎన్నో మలుపులు, మరెన్నో రికార్డులు నమోదవ్వడంతో పాటు అంతకుమించిన ఆసక్తికర దృశ్యాలు క్రికెట్ ప్రేమికులకు మధురానుభూతులను మిగిల్చాయి. మ్యాచ్ అనంతరం కోహ్లి కళ్లు చెమర్చడం, రోహిత్.. విరాట్‌ను భుజంపైకి ఎత్తుకుని విజయ గర్వంతో గర్జించడం, భావోద్వేగంతో హార్ధిక్ కంటతడి పెట్టడం, సునీల్ గవాస్కర్ డ్యాన్స్ చేయడం.. ఇలా చాలా సన్నివేశాలు భారత క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
https://t.co/23cs2byVka pic.twitter.com/itACHggGiX
— Chaitanya (@chaitu_20_) October 23, 2022
వీటిలో హిట్‌మ్యాన్.. కోహ్లిని భుజంపై ఎత్తుకున్న సన్నివేశం ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సన్నివేశాన్ని చూసిన రోహిత్, విరాట్ ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. టీమిండియా కృష్ణార్జునులు, ట్రిపుల్ ఆర్ రామ్-భీమ్ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. రోహిత్-విరాట్‌ను ఎత్తుకున్న సన్నివేశం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో రెండు పాత వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అవేంటంటే.. పాక్‌పై విక్టరీ అనంతరం రోహిత్.. కోహ్లిని ఎలా ఎత్తుకున్నాడో అచ్చం అలానే గతంలో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు కోహ్లిని ఎత్తుకున్నారు. 2014లో సౌతాఫ్రికాపై కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (72 నాటౌట్) అనంతరం యువీ.. కోహ్లిని మైదానం మొత్తం ఎత్తుకుని తిరిగాడు. మొహాలీ వేదికగా 2016లో కోహ్లి ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్)కు ఫిదా అయిన భజ్జీ కూడా కోహ్లిని రెండు చేతులతో ఎత్తుకుని అభినందించాడు. పై మూడు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలను ఓ నెటిజన్ ఎడిట్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. కోహ్లి ధమాకా ఇన్నింగ్స్ నుంచి ఇంకా తేరుకోని ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు.
చదవండి: ద్రవిడ్‌ను వెనక్కు నెట్టిన కోహ్లి.. ఇక మిగిలింది ఐదుగురే..!
Comments
Please login to add a commentAdd a comment