T20 World Cup 2022- Team India: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ముందుకు వెళ్లాలంటే టీమిండియా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు. సెమీస్‌కు నేరుగా దూసుకుపోవాలంటే తుది జట్టులో మార్పులు అనివార్యమని అభిప్రాయపడ్డాడు. పేలవ ఫామ్ కొనసాగిస్తున్న కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టడం సహా బౌలర్ల మార్పు విషయంలోనూ పలు సలహాలు ఇచ్చాడు ఈ మాజీ ఆఫ్ స్పిన్నర్.
సూపర్-12లో భాగంగా తొలుత పాకిస్తాన్, తర్వాత నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన రోహిత్ సేన.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. సెమీస్‌లో గట్టి పోటీదారుగా ఉన్న ప్రొటిస్ చేతిలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పరాజయం చెందింది.
మరోసారి విఫలం
ఇక ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. పాక్, డచ్ జట్లతో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైన ఈ కర్ణాటక బ్యాటర్.. 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ సైతం 15 పరుగులకే వెనుదిరిగాడు.
దీంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా కనీసం 133 పరుగులు చేయగలిగింది.
రాహుల్ పరిస్థితి ఇలా ఉంటే.. దినేశ్ కార్తిక్ సైతం ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు.
రాహుల్ గొప్ప ఆటగాడే కానీ
ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేనేజ్‌మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. కేఎల్ రాహుల్ గొప్ప ఆటగాడే. తను మ్యాచ్ విన్నర్ కూడా! కానీ.. తన పేలవ ఫామ్ ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించకతప్పదు.
కార్తిక్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా రిషభ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయడం బెటర్’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
అతడిని ఎందుకు పక్కనపెట్టారు?
అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో యజువేంద్ర చహల్‌ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని హర్భజన్ సూచించాడు. టీ20 క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఉన్న చహల్ కన్నా ప్రస్తుతం జట్టులో మరో లెగ్ స్పిన్నర్ లేడని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న మ్యాచ్ విన్నర్ చహల్‌కు అవకాశం ఇవ్వాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు.
చదవండి: #OnThisDay: నాడు నిరాశపరిచిన సచిన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన ధోని! మిస్టర్ కూల్ తుపాన్ ఇన్నింగ్స్ చూశారా!
T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు..
Comments
Please login to add a commentAdd a comment