గంభీర్- ధోని (ఫైల్ ఫొటోలు)
Harbhajan Won The Match, Dhoni And I...": Gambhir: ‘‘ధోనితో కలిసి నేను మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసిన మాట వాస్తవమే. అయితే, ఆరోజు నేను టీమిండియాను గెలిపించలేదు. హర్భజన్ ఆ పని చేశాడు. కానీ.. ఛేజింగ్‌లో ఏ బ్యాటర్ అయితే తన పరుగుతో లక్ష్యం పూర్తి చేశాడో అతడే జట్టును గెలిపించినట్లు భావించడం సహజం.
నేను కూడా అదే నమ్ముతాను’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. 2010 నాటి ఆసియా కప్ టోర్నీలో టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ సంగతుల ప్రస్తావన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, గౌతీ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులు మండిపడుతున్నారు.
ధోని ఫ్యాన్స్ ఆగ్రహం
‘‘ఇది వెటకారమా? లేదంటే ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడటం నీకు అలవాటా? కాస్తైనా బుద్ధి ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. కాగా ఆసియా వన్డే కప్-2023లో భాగంగా శ్రీలంక వేదికగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో శనివారం పాకిస్తాన్‌తో తలపడిన విషయం తెలిసిందే.
ఆ క్రెడిట్ భజ్జీకే ఇవ్వాలి
ఈ మ్యాచ్ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ 2010 నాటి దాయాదుల పోరు దృశ్యాలను ప్లే చేసింది. ఈ క్రమంలో కామెంటేటర్ గంభీర్.. నాడు టీమిండియాను గెలిపించిన ఘనత హర్భజన్ సింగ్‌కే ఇవ్వాలని పేర్కొన్నాడు. కాగా ఆనాడు డంబుల్లా మ్యాచ్‌లో.. పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో టీమిండియా 49.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో 83 పరుగులతో ఓపెనర్ గంభీర్ అదరగొట్టగా.. కెప్టెన్ ధోని 56 పరుగులతో రాణించాడు. అయితే, ఆఖరి వరకు అజేయంగా నిలిచిన ఆఫ్ స్పిన్నర్ భజ్జీ విన్నింగ్ రన్ తీశాడు.
ధోని విన్నింగ్స్ సిక్సర్‌ను తక్కువ చేసే విధంగా
దీంతో పాకిస్తాన్‌పై భారత్ గెలుపొందగా.. గంభీర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గంభీర్ పైవిధంగా కామెంట్ చేశాడు. అయితే, కొంతకాలం క్రితం.. ‘‘2011 వరల్డ్‌కప్ ఈవెంట్లో మనం యువరాజ్ సింగ్ ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వలేదు.
జహీర్ ఖాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్.. సచిన్ టెండుల్కర్ అందరూ రాణించారు. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. మీడియా మొత్తం ఎంఎస్ ధోని సిక్సర్ గురించే కోడైకూసింది. వ్యక్తిగత ఆరాధన మత్తులో పడి జట్టును మరిచిపోయింది’’ అని గంభీర్ రెవ్‌స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. దీంతో గౌతీ అప్పటి.. ఇప్పటి వ్యాఖ్యలను పోలుస్తూ మిస్టర్ కూల్ ధోని ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.
చదవండి: 3 గోల్డెన్ క్యాచ్‌లు డ్రాప్.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన నేపాల్ ఓపెనర్
Here’s the much talked about clip of Gautam Gambhir’s commentary last night.
— Vibhor (@dhotedhulwate) September 3, 2023
Gautam Gambhir was the POTM in the 2010 Asia Cup Final between India and Pakistan.
He says “Actually, it wasn’t me who won the match for the team. There was a partnership between me and Dhoni, but I… pic.twitter.com/NfwwmN4rMZ
"Dhoni finishes off in style!" 🇮🇳🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018
Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp
Comments
Please login to add a commentAdd a comment