
India Vs Australia 2023: ‘‘అతడి ఆటతీరును ఒక్కసారి గమనించండి. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టెస్టుల్లోనే కాదు.. వన్డేల్లో కూడా అతడిని వైస్ కెప్టెన్ చేయాలి. టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఇంకొకటి దొరకదు’’ అని టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ ఆల్‌రౌండర్ రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్ చేయాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ జడ్డూ తుదిజట్టులో ఉంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని అభిప్రాయపడ్డాడు.
భీకర ఫామ్‌లో ఉన్న జడేజా
ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బంతితోనూ, బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గాయం కారణంగా చాలాకాలం జట్టుకు దూరమైన జడేజా.. పునరాగమనంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల్లో అద్భుతంగా రాణించి రెండింటిలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజాపై హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు బీసీసీఐ సంకేతాలు ఇచ్చిన వేళ.. జడేజాకు ఆ బాధ్యతలు ఇవ్వాలని సూచించాడు.
కేవలం టెస్టులకు కాదు.. వన్డేల్లో కూడా
కేవలం టెస్టులకే పరిమితం కాకుండా.. వన్డేల్లోనూ రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘తుది జట్టులో తప్పకుండా చోటు దక్కించుకునే ఆటగాడిని వైస్ కెప్టెన్ చేస్తే బాగుంటుంది.
స్వదేశంలో, విదేశాల్లోనూ రాణించగల ప్రతిభ జడేజా సొంతం. అందుకే అతడిని తప్పకుండా వైస్ కెప్టెన్ చేయాలి. సీనియర్‌గా ఎల్లప్పుడూ జట్టుకు సేవలు అందిస్తూ ఉంటాడు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
అప్పుడేం జరిగిందో చూశాం కదా!
అయితే, విశ్లేషకులు, అభిమానులు మాత్రం భజ్జీ సూచనపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘జడ్డూ అద్భుత ఆల్‌రౌండర్ అనడంలో సందేహం లేదు. అయితే, అతడి నెత్తిపై కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వంటి బాధ్యతలు పెడితే కచ్చితంగా ఒత్తిడికి లోనవుతాడు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ సారథిగా ఎలా వైఫల్యం చెందాడో చూశాం కదా! మధ్యలోనే కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడంతో ధోని మళ్లీ ఆ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అసలే ఈసారి వన్డే వరల్డ్‌కప్. ఇలాంటి సమయంలో జడ్డూకు అదనపు బాధ్యతలు అప్పగించడం బాగుండేదేమో పాజీ! అతడిని స్వేచ్ఛగా వదిలేస్తేనే అద్భుతంగా రాణించగలడు’’ అని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే... ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ వారసుడిగా పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. రోహిత్ గైర్హాజరీలో ఇప్పటికే పలు టీ20 సిరీస్‌లు గెలిచిన హార్దిక్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న మొదటి వన్డేకు సారథిగా ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్-2023లో అతడు మరింత కీలకం కానున్నాడు.
చదవండి: నీకోసమే నాన్నా.. ఎంత పనిజేసినవ్ కొడుకా! వీడియో వైరల్
Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు!
Comments
Please login to add a commentAdd a comment