
PC: IPL.com
ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని.. "కెప్టెన్ కూల్"గా పేరు గాంచిన సంగతి తెలిసిందే. చాలా మ్యాచ్‌ల్లో ధోని తన ప్రశాంతతతోనే భారత జట్టుకు అద్భుతమైన విజయాలను అందించాడు. ధోని తన చర్యలతో ఎంతోమంది యువ కెప్టెన్‌లకు ఆదర్శంగా నిలిచాడు. అటువంటి ధోని ఓ సందర్భంలో తన ప్రశంతతనను కోల్పోయి బ్యాట్ విరగ్గొట్టాడంట.
ఈ విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి భారత జట్టుకు ఆడిన విషయం విధితమే. జార్ఖండ్‌లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ధోని తన బ్యాట్‌ను విరగ్గొట్టినట్లు భజ్జీ తెలిపాడు.
"జార్ఖండ్‌లో మేము రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడుతున్నాం. ఈ మ్యాచ్‌లో ధోని జట్టు చాలా వెనుకబడింది. ధోని ఆఖరిలో బ్యాటింగ్ వచ్చాడు. ఈ క్రమంలో తన జట్టు వెనుకబడడంతో ధోని కోపంతో ఊగిపోయాడు. తన బ్యాట్‌ని నెలకేసి కొట్టాడు.
దీంతో బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది" అని సీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా హర్భజన్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సీఎస్‌కే.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
చదవండి: IPL 2023: ఢిల్లీతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పులు! 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment