ఫిబ్రవరి9 నుంచి నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టెస్టుతో బోర్డర్-గవాస్కర్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా ఎవరిని పంపాలన్న డిబేట్ ప్రస్తుతం క్రీడావర్గాల్లో నడుస్తోంది. కొంతమంది రోహిత్ జోడీగా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ను పంపాలని సూచిస్తుంటే.. మరి కొంతమంది కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. శుబ్‌మన్ గిల్‌ని ఓపెనర్‌గా ఆడించడమే కరెక్ట్ అంటూ హర్భజన్ అన్నాడు. కాగా తొలి టెస్టుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని జట్టు మెనేజెమెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడూతూ.. "టెస్టు సిరీస్‌లలో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. నా వరకు అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత ఓపెనర్లుగా రోహిత్, శుబ్‌మన్ గిల్ ఉంటే బాగుంటుంది. గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక రాహుల్ కూడా స్టార్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే రాహుల్ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. కాబట్టి గిల్‌ను రోహిత్ జోడిగా పంపాలి. ఈ సిరీస్ మొత్తం మ్యాచ్‌ల్లో అతడికి అవకాశం ఇవ్వాలి. గిల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమేమీ కాదు అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: కోహ్లి, స్మిత్ మధ్య తీవ్ర వాగ్వాదం.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
Steve Smith: భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడం.. యాషెస్ విజయం కంటే గొప్పది! అంతేగా..
Comments
Please login to add a commentAdd a comment