
Harbhajan Singh Not joining In BJP: త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో తనపై ప్రచారంలో ఉన్న వార్తలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు సామాజిక మధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని ప్రజలు పట్టించుకోరాదని కోరాడు.
కాగా, భజ్జీతో పాటు టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌పై ఇలాంటి ప్రచారమే జరుగుతుంది. ఈ విషయమై యువీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే, 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా భజ్జీపై ఇలాంటి ప్రచారమే జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో భజ్జీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, హర్భజన్ త్వరలోనే అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి ఐపీఎల్‌లో కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి .
చదవండి: Akthar: తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడు..!
Comments
Please login to add a commentAdd a comment