ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తరఫున ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నెలకొల్పిన ఆల్‌టైమ్ రికార్డుపై టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఎంపీ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 2016 సీజన్‌లో విరాట్ సాధించిన అత్యుత్తమ గణాంకాలను (16 మ్యాచ్‌ల్లో 81.08 సగటున 152 స్ట్రయిక్ రేటుతో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో 973 పరుగులు) ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ తప్పక అధిగమిస్తాడని భజ్జీ జోస్యం చెప్పాడు.
ఈ సీజన్‌లో ఇప్పటికే 10 ఇన్నింగ్స్‌ల్లో 65.33 సగటున 150.77 స్ట్రయిక్ రేటుతో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 588 పరుగులు సాధించిన బట్లర్ ఆరెంజ్ క్యాప్‌ను హోల్డ్ చేయడంతో పాటు కోహ్లి రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడని, ఈ సీజన్‌లో రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరితే కోహ్లి రికార్డు బద్దలు కావడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. కోహ్లి రికార్డును బట్లర్ అధిగమించి ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయాలంటే గ్రూప్ స్టేజీలో ఆ జట్టు ఆడాల్సిన మిగిలిన 4 మ్యాచ్‌లతో పాటు ప్లే ఆఫ్స్‌లోనూ అదరగొట్టాల్సి ఉంటుందని అన్నాడు.
కోహ్లి రికార్డును అధిగమించే అర్హత, సత్తా బట్లర్‌కు ఉన్నాయని, ఈ సీజన్‌లో అతని ఫామ్ చూస్తుంటే కోహ్లి రికార్డుతో పాటు మరెన్నో రికార్డులకు బీటలు వారడం ఖాయమని అంచనా వేశాడు. అయితే, బట్లర్ ఈ ఘనతలను సాధించాలంటే రాజస్థాన్ ఫైనల్స్ వరకు చేరాల్సి ఉంటుందని అన్నాడు. లీగ్ దశ మ్యాచ్‌లతో పాటు ప్లే ఆఫ్స్ జరిగే పిచ్‌లు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించడం బట్లర్‌కు కలిసొస్తుందని తెలిపాడు.
కాగా, రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో (గ్రూప్ దశలో) రెండింటిలో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. రాజస్థాన్ ఇవాళ (మే 7) పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.
చదవండి: IPL 2022: కరుణ్ అవుట్.. యశస్వి ఇన్: సంజూ శాంసన్
Comments
Please login to add a commentAdd a comment