IPL 2022 | PBKS vs RR: Jos Butler Joint Fastest in IPL Season Alongside Kohli - Sakshi
Sakshi News home page

Jos Butler: బట్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. అరుదైన రికార్డు.. కోహ్లితో పాటుగా..

Published Sat, May 7 2022 6:41 PM | Last Updated on Sat, May 7 2022 8:30 PM

IPL 2022 PBKS Vs RR: Jos Butler Joint Fastest In IPL Season Alongside Kohli - Sakshi

IPL 2022 PBKS Vs RR- Jos Butler Record: ఐపీఎల్‌-2022లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌. రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌తో శనివారం(మే 7) నాటి మ్యాచ్‌లో 30 పరుగులు చేసిన బట్లర్‌.. తాజా ఎడిషన్‌లో 618 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యంత వేగంగా 600 పరుగుల మార్కును పూర్తి చేసుకున్న క్రికెటర్ల జాబితాలో చేరాడు. కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌లలో జోస్‌ బట్లర్‌ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు షాన్‌ మార్ష్‌(2008), క్రిస్‌ గేల్‌(2011), విరాట్‌ కోహ్లి(2016), డేవిడ్‌ వార్నర్‌(2019)లో అత్యంత వేగంగా ఆరు వందలకు పైగా పరుగులు సాధించిన బ్యాటర్లుగా చరిత్రలో నిలిచారు.

ఇక ఈ సీజన్‌లో బట్లర్‌ అత్యధిక స్కోరు 116. మొత్తం పరుగులు 618. అర్ధ శతకాలు 3. సెంచరీలు 3. ప్రస్తుతం అతడు ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. బట్లర్‌ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 451 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 

చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. అచ్చిరాని జెర్సీతో బ‌రిలో దిగ‌నున్న‌ ఆర్సీబీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement