
ఆసియాకప్-2023కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్‌తో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనుండగా.. యువ ఆటగాడు తిలక్ వర్మకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. అయితే ఈ జట్టులో స్టార్‌స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు.
చహల్‌కు బదులగా కుల్దీప్ యాదవ్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఇక ఆసియాకప్ జట్టు నుంచి చహల్‌ను పక్కన పెట్టడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుబట్టాడు. వైట్ బాల్ క్రికెట్‌లో చాహల్ అత్యుత్తమ బౌలర్ అని, అతడికి చోటు దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించందని హర్భజన్ అన్నాడు.
"యుజ్వేంద్ర చాహల్ జట్టులో లేకపోవడం భారత్‌కు తీరని లోటు. ఎందుకంటే ఆసియాకప్‌కు ఎంపిక చేసిన జట్టులో లెగ్ స్పిన్నర్ ఒక్కరు కూడా లేరు. లెగ్ స్పిన్నర్‌కు మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉంటుంది. వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టులో చాహల్ కంటే మెరుగైన స్పిన్నర్ మరొకడు లేడు. అతడు గత కొన్ని మ్యాచ్‌ల్లో బాగా రాణించకపోవచ్చు.
అంత మాత్రాన అతడు మంచి బౌలర్ కాకుండా పోడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు అతడి సేవలు చాలా అవసరం. అతడికి జట్టులోకి వచ్చేందుకు దారులు ఇంకా మూసుకుపోలేదని నేను అనుకుంటున్నాను. వరల్డ్‌కప్ భారత్‌లో జరగనుంది. కాబట్టి చాహల్‌ను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. చాహల్ మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్. అతడు ఫామ్‌లో లేడని నాకు తెలుసు. కానీ జట్టుతో లేకపోతే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌లో భారత్‌దే పై చేయి.. ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని దాయాదులు!