ఆసియాకప్ 2023కు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపికచేశారు. సుదీర్ఘ కాలంగా గాయాలతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని హైదరాబాదీ తిలక్ వర్మకు కీలకమైన ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గమానార్హం.
ఇక టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలో చాహల్‌ను కాదని కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కుల్దీప్ బ్యాట్‌తో కూడా రాణించగలడని, అందుకే చహల్‌ను కాదని అతడిని ఎంపిక చేశారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
"విండీస్ సిరీస్‌లో సంజు శాంసన్ ఎక్కువ పరుగులు చేసి ఉంటే అతడు ఖచ్చితంగా ఈ జట్టులో ఉండేవాడు. అలాగే చాహల్ కూడా వికెట్లు పడగొట్టి ఉంటే జట్టులో అవకాశం దక్కి ఉండేది. అయితే కొన్ని సార్లు జట్టును బ్యాలెన్స్ చేయాలంటే కొంతమందిపై వేటుపడక తప్పదు. కుల్దీప్‌కు లోయార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది.
ఈ కోణంలోనే సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కుల్దీప్ చైనామన్ బౌలర్ కూడా కావడం అతడికి కలిసొచ్చింది. అందుకే చహల్‌ను కాదని కుల్దీప్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారాని" గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: Yuzvendra Chahal: అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్..
Comments
Please login to add a commentAdd a comment