ప్రపంచ క్రికెట్‌లో బిగ్గెస్ట్ ఫైట్ మరికొన్ని గంంటల మాత్రమే మిగిలి ఉంది. ఆసియాకప్-2023లో భాగంగా శనివారం చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. దాయాదుల పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె మైదానం వేదికైంది.
ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదరుచూస్తున్నారు. కాగా పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.
పాక్‌తో మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ దూరం కావడంతో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే కిషన్‌కు మిడిలార్డర్ బ్యాటింగ్ చేసిన అనుభవం లేకపోవడంతో అతడు రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే రెగ్యూలర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను మూడో స్ధానంలో, కోహ్లిని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలని పలువరు సూచిస్తున్నారు.
సాధారణంగా కోహ్లి ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. ఇక ఇదే భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఎట్టిపరిస్ధితుల్లోనూ కోహ్లీ బ్యాటింగ్ స్థానం మార్చకూడదని గవాస్కర్ తెలిపాడు."విరాట్ కోహ్లి ఒక అద్భుతమైన ఆటగాడు. అటువంటి అత్యుత్తమ ప్లేయర్‌కు ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలి. కోహ్లి మూడో స్ధానంలో వస్తేనే గరిష్ట సంఖ్యలో ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది.
అతడికి ఆ స్ధానంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతడు ఆపోజిషేన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి దాదాపు 43 సెంచరీలు సాధించాడు. అంతేకాకుండా ఛేజింగ్‌లో ఒంటి చేత్తో విజయాలు అందించిన సందర్భాలు ఉన్నయి. ఇంతగా విజయవంతమైన ఆటగాడి బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం లేదు అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: పాక్ స్టార్ బౌలర్‌ను కలిసిన విరాట్ కోహ్లి.. టీ20 ప్రపంచకప్ రిపీట్ అవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment