Harbhajan All Time IPL X1: 15 వసంతాల ఐపీఎల్ చరిత్రలో చాలా మంది మాజీల లాగే టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ కూడా తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు సారధిగా మహేంద్ర సింగ్ ధోనిని ఎంచుకున్న భజ్జీ.. టీమిండియా నుంచి ఐదుగురు ఆటగాళ్లను, వెస్టిండీస్‌కు చెందిన ముగ్గురికి, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లకు చెందిన తలో ఆటగాడికి చోటు కల్పించాడు.
భజ్జీ ప్రకటించిన జట్టులో ఎలాంటి సంచలనాలకీ తావు లేనప్పటికీ ఆసీస్ స్టార్ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు చోటు కల్పించకపోవడం చర్చనీయంశంగా మారింది. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యాటర్లలో ఒకడిగా చెప్పుకునే వార్నర్ భాయ్ ఒక్కడికి చోటు కల్పించి ఉంటే జట్టు మరింత సమతూకంగా ఉండేదని వార్నర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తన ఆల్‌టైం ఐపీఎల్ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంచుకున్న భజ్జీ.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగు, ఐదు స్థానాల కోసం
షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్‌లను ఎంపిక చేశాడు. ఆతరువాత ఆరో స్థానం కోసం ధోనిని (వికెట్‌కీపర్) ఎంపిక చేసిన టర్బోనేటర్.. ఆల్‌రౌండర్ల కోటాలో కీరన్ పోలార్డ్, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించాడు.
భజ్జీ జట్టులో ఏదైనా సంచలన ఎంపిక జరిగిందంటే సునీల్ నరైన్‌దేనని చెప్పాలి. క్యాష్ రిచ్ లీగ్‌లో అమిత్ మిశ్రా, చహల్ లాంటి ఎందరో సక్సెస్‌ఫుల్ స్పిన్నర్లు ఉన్నా భజ్జీ నరైన్‌కు చోటు కల్పించడం విశేషం. స్వయంగా స్పిన్నర్ అయినప్పటికీ ఆ కోటాలో భజ్జీ తన పేరును ఎంపిక చేసుకోలేదు. నరైన్‌కు బ్యాట్‌తో మెరుపులు మెరిపించగల సత్తా ఉండటమే భజ్జీ ఎంపికకు కారణంగా తెలుస్తోంది. చివరిగా స్పెషలిస్ట్ పేసర్ల విషయానికొస్తే.. ఈ స్థానాలను ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్లలో ఒకరైన లసిత్ మలింగ, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు కేటాయించాడు.
హర్భజన్ సింగ్ ఐపీఎల్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవెన్: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, షేన్ వాట్సన్, ఏబీ డివిల్లియర్స్, ఎంఎస్ ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, కీరన్ పోలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: సీఎస్‌కే తరపున ధోని అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment