వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు భారత మహిళల హాకీ జట్టు శ్రమించాల్సి ఉంటుంది. జనవరి 13 నుంచి 19 వరకు రాంచీలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్న–1కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) సోమవారం విడుదల చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్‌తోపాటు ఈ టోరీ్నలో ప్రపంచ ఐదో ర్యాంకర్ జర్మనీ, న్యూజిలాండ్ (9), జపాన్ (11), చిలీ (14), అమెరికా (15), ఇటలీ (19), చెక్ రిపబ్లిక్ (25) జట్లు బరిలో ఉన్నాయి.
ఈ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గిన మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. జనవరి 13 నుంచి 20 వరకు స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఎనిమిది జట్ల (బెల్జియం, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, మలేసియా, దక్షిణ కొరియా, స్పెయిన్, ఉక్రెయిన్) మధ్య క్వాలిఫయింగ్–2 టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీ ద్వారా మరో మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment