
పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత ఏకైక జూడో ప్లేయర్ తులికా మాన్ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలైంది.

శుక్రవారం జరిగిన మహిళల ప్లస్ 78 కేజీల విభాగంలో తులికా 0–10తో ఓర్టిజ్ (క్యూబా) చేతిలో ఓడింది

ఇప్పటి వరకు నాలుగు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఓర్టిజ్ ముందు తులికా మాన్ నిలవలేకపోయింది

28 సెకన్లలోనే భారత జూడోకోను చెక్‌హోల్డ్‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన ఓర్టిజ్ విజయం సాధించింది

అయితే తదుపరి రౌండ్‌లో ఓర్టిజ్ పరాజయం పాలైంది

ఫలితంగా తులికా మాన్‌కు రెపిచాజ్ ద్వారా కాంస్య పతక పోరులో బరిలోకి దిగే అవకాశం కూడా లేకుండా పోయింది






