
భూమ్మీద అతిపెద్ద క్రీడా పోటీల సంబరం ఏదంటై ఠక్కున గుర్తొచ్చేది ఒలింపిక్స్. అలాంటి ఒలిపింక్స్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 పోటీలు 2021లో సాదాసీదాగా జరిగాయి. సత్తా చాటిన క్రీడాకారులు పతకాలు సొంతం చేసుకున్న విజయానందంతో తమ స్వదేశాలకు చేరుకున్నారు. ఆదివారంతో క్రీడా పోటీలు ముగిశాయి. అయితే ఇప్పుడు మరో ఒలింపిక్స్ వార్త వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు భూమ్మీద ఒలింపిక్స్ చూశారు ఇప్పుడు అంతరిక్షంలో కూడా పోటీలు జరిగాయి.
వ్యోమగాములు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో పలు పోటీలు సరదాగా ఆడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వారి ఆటలు చూస్తుంటే తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. జిమ్నాస్టిక్స్, ఈత, నో హ్యాండ్‌బాల్, వెయిట్‌లెస్ షార్ప్ వంటి ఆటలు ఆడేందుకు తెగ పాట్లు పడుతున్నారు. వారి పాట్లు మనకు హాస్యం పంచుతున్నారు. జీవో గ్రావిటీలో నాలుగు రకాల ఆటలు ఆడారు.
బాల్‌ను పట్టుకునేందుకు.. జంప్స్ చేసేందుకు పడుతున్న కష్టాలు సరదాగా ఉన్నాయి. ఆస్ట్రోనాట్స్ కూడా సరదాగా నవ్వుతూ ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ పెక్క్వెట్ తెలిపారు. అచ్చం భూలోకంలో జరిగినట్టు ఈ ఒలింపిక్స్ వేడుకల ముగింపు కార్యక్రమం కూడా నిర్వహించడం విశేషం.