ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో టీమిండియాను ఓటమి మరోసారి వెక్కిరించింది. 9 నెలల వ్యవధిలో వరుసగా మూడో ఐసీసీ ఈవెంట్ తుది పోరులో భారత్ ఓటమి చవిచూసింది. ఫార్మాట్లు మారిన ప్రత్యర్ధి మాత్రం మారలేదు. అదే ప్రత్యర్థి.. అదే ఆస్ట్రేలియా. తొలి రెండు సందర్భాల్లో సీనియర్ జట్టు వంతు అయితే.. ఇప్పుడు కుర్రాళ్ల వంతు.
అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. టోర్నీ మొత్తం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్‌మన్, రాఫ్ మెక్‌మిలన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కల్లమ్ విడ్లే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకముందు డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సీనియర్ జట్టు చేతిలో రోహిత్ సేన ఓటమి పాలవ్వగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశారు.
ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని సహారన్ అంగీకరించాడు.
"ఈ టోర్నీ మొత్తం మా బాయ్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయాం. బ్యాటింగ్‌లో మేము సమిష్టిగా విఫలమయ్యాం. మేము ఈ మ్యాచ్ కోసం బాగా సన్నద్దమయ్యాం.
కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. మా బాయ్స్ కొంతమంది ర్యాంప్ షాట్లు ఆడి ఔటయ్యారు. ఆదర్శ్‌తో పాటు ఎవరో ఒకరు క్రీజులో ఉండి ఉండే పరిస్థితి మరోవిధంగా ఉండేది.అయితే ఈ టోర్నమెంట్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ టోర్నీలో ఆడిన అనుభవం భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సహారన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 397 పరుగులు చేసిన సహారన్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment