
ఖతర్ వేదికగా అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి అర్థభాగంలోనే రెండు గోల్స్ సాధించిన అర్జెంటీనా ఫ్రాన్స్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్‌తో మెరిశాడు. ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్‌తో మెరవడంతో తొలి అర్థభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇక పెనాల్టీలు కొట్టడంలో తనకు తానే సాటి అని మెస్సీ మరోసారి నిరూపించుకున్నాడు. ఆట 23వ నిమిషంలో ఫ్రాన్స్ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన పెనాల్టీ అద్భుతమనే చెప్పాలి. అయితే పెనాల్టీ కొట్టడానికి ముందు మెస్సీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మెస్సీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని మెస్సీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫైనల్లో ఓడితే కప్ లేకుండానే మెస్సీ కెరీర్ ముగుస్తుంది. అందుకే పెనాల్టీ కొట్టడానికి ముందు అంత ఎమోషనల్ అయ్యాడు. ఇక పెనాల్టీని గోల్‌గా మలిచిన తర్వాత మెస్సీ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. ఇక అర్జెంటీనాకు గోల్ వచ్చిన తర్వాత స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది.
BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥
— JioCinema (@JioCinema) December 18, 2022
Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm