ఐపీఎల్ 2023 ఫైనల్ ఆదివారం సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉన్నప్పటికి వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. సోమవారం మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికి వర్షం పడే అవకాశం 60శాతం ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
ఈ విషయం పక్కనబెడితే.. స్టేడియంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై ఒక మహిళా అభిమాని దౌర్జన్యం చేసింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత అతన్ని కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా తన్నింది.
అయితే ఆ అధికారి మాత్రం ఆమెను ఏమనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మరోసారి మహిళ తన కాలితో అతన్ని తన్నడం అక్కడి కెమెరాలకు చిక్కింది. పక్కనే ఉన్నవాళ్లు గొడవను చూస్తూ ఆనందిస్తున్నారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This woman slapped and hit this male officer like anything and the helpless guy couldn't do anything. Is this woman empowerment?
— Harshit 🇮🇳 (@Imharshit_45) May 28, 2023
Worst Fanbase Ever 🤮🤮@ChennaiIPL #CSKvGT #GTvCSK #Rain #Ahmedabad pic.twitter.com/lH8N0bsSL5
చదవండి: దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా!
Comments
Please login to add a commentAdd a comment