ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ గాయపడ్డాడు. సోమవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ వేస్తుండగా స్లిప్ అయ్యాడు. దీంతో ఉనాద్కట్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆర్‌సీబీతో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. రిపోర్డ్స్ వచ్చాకా కానీ ఉనాద్కట్ ఆడుతాడా లేదా అనేది తేలనుంది.
అయితే ఐపీఎల్ కంటే మరొక విషయం కలవరపెడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. ఇక జైదేవ్ ఉనాద్కట్ 15 మందితో కూడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఉనాద్కట్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమైనప్పటికి మేజర్ మ్యాచ్ కావడం టీమిండియా ఆందోళనకు కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే బుమ్రా దూరం కాగా.. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఉనాద్కట్ గాయపడిన వీడియోనూ ఐపీఎల్ వెబ్‌సైట్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. ''గాయపడిన ఉనాద్కట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
భారత టెస్టు జట్టు WTC ఫైనల్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
See you back on the field soon @JDUnadkat
— IndianPremierLeague (@IPL) May 1, 2023
Wishing a quick recovery to the left-arm pacer 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/w57d7DMadN
చదవండి: టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి
Comments
Please login to add a commentAdd a comment