టి20 ప్రపంచకప్‌లో ఆదివారం(నవంబర్ 13న) మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మరి పొట్టి ప్రపంచకప్‌లో విజేత ఎవరనేది ఒక్క రోజులో తేలనుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే పాక్ గెలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ రికార్డులన్నీ ఇంగ్లండ్‌కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్‌దే విజయమని.. పాక్ టైటిల్ కొట్టడం కష్టమేనని కొంతమంది పేర్కొంటున్నారు.
► ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 28 టి20ల్లో ఎదురుపడితే.. వాటిలో ఇంగ్లండ్ 18 విజయాలు నమోదు చేయగా.. పాక్ ఖాతాలో తొమ్మిది విజయాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కదానిలో ఫలితం రాలేదు.
► టి20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన రెండు సందర్భాల్లోనూ ఇంగ్లండ్‌నే విజయం వరించింది.
► 2019 నుంచి చూసుకుంటే ఇరుజట్ల మధ్య 14 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 8 మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలవగా.. ఐదు పాక్ గెలిచింది. ఒక్క దానిలో ఫలితం రాలేదు.
► చివరగా టి20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరిగింది. సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. 4-3 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
► పాకిస్తాన్ ఇది ఫైనల్‌కు చేరడం మూడోసారి కాగా.. ఇంగ్లండ్‌కు కూడా మూడో ఫైనల్ కావడం విశేషం. ఇక రెండు జట్లు ఒక ఫైనల్ గెలిచి.. మరొక ఫైనల్ ఓడి సమానంగా ఉన్నాయి.
► పాకిస్తాన్ 2009లో టి20 చాంపియన్స్‌గా నిలిస్తే.. ఆ మరుసటి ఏడాది అంటే 2010లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది.
► ఒకవేళ ఇంగ్లండ్ ఈసారి టి20 ప్రపంచకప్ గెలిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఏకకాలంలో వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్ సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది
► ఇక ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అన్ని మ్యాచ్‌లు కలిపి 669 పరుగులు చేస్తే.. అందులో ఓపెనర్లు బట్లర్, హేల్స్ ద్వయం 410 పరుగులు చేయడం విశేషం.
► ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లపై మంచి రికార్డు ఉంది. బాబర్ మూడుసార్లు ఔట్ చేసిన రషీద్.. రిజ్వాన్‌ను రెండుసార్లు పెవిలియన్ చేర్చాడు. అదే సమయంలో బాబర్ ఆజం, రిజ్వాన్ జంటకు ఇంగ్లండ్‌పై మంచి స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉంది.
పాక్ తుదిజట్టు అంచనా: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ వసిం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్
ఇంగ్లండ్ తుదిజట్టు అంచనా: జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్
Comments
Please login to add a commentAdd a comment