ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భారత- ఏ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. కొలంబోలో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 51 పరుగులతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. తద్వారా తొలి సెమీస్‌లో శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌తో టైటిల్ వేటలో తలపడనుంది.
యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు.
ఇక నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్‌సిన్హ్ దోడియా 0(నాటౌట్) నిరాశ పరిచారు. 49.1ఓవర్లలో కేవలం 211 పరుగులు మాత్రమే చేసిన యశ్ ధుల్ సేన ఆలౌట్ అయింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ తలా రెండు వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చెలరేగిన స్పిన్నర్లు
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో దంచికొట్టింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ 38, తంజీద్ హసన్ 51 పరుగులతో రాణించారు. వన్‌డౌన్లో వచ్చిన జాకీర్ హసన్ మాత్రం 5 పరుగులకే చేతులెత్తేయగా.. భారత స్పిన్నర్లు మానవ్ సుతార్, నిశాంత్ సింధు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు.
మానవ్ 3 వికెట్లు సాధించగా.. నిశాంత్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. యువరాజ్‌సిన్హ్ దోడియా , అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. దీంతో 160 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. 51 పరుగులతో భారత జయభేరి మోగించింది. యశ్ ధుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక జూలై 23న ఫైనల్లో పాకిస్తాన్‌ను భారత్ ఢీకొట్టనుంది.
చదవండి: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment