భారత్-పాక్ క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. తమ ఆరాధ్య జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయాని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి.
జూలై 13(శనివారం) నార్తాంప్టన్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్ధులైన భారత్- పాక్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 86 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు రాగా.. తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌ను ఓడించి పాక్ తుది పోరుకు ఆర్హత సాధించింది.
ఈ ఫైనల్ పోరులో గెలిచి లీగ్ స్టేజ్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. గ్రూపు స్టేజిలో పాక్ చేతిలో భారత్ 68 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. అయితే పాక్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. పాక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
ఈ టోర్నీలో పాక్ ఇప్పటివరకు ఆజేయంగా నిలిచింది. కానీ ఆసీస్‌తో సెమీస్‌లో ఆడినట్లు భారత బ్యాటర్లు చెలరేగితే పాక్ కచ్చితంగా తలవంచాల్సిందే. భారత బ్యాటర్లలో ఉతప్ప, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment