పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 13 సార్లు విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) తమ జోరు కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై నెగ్గగా... ఐదో సీడ్ నాదల్ 6–3, 6–2, 6–4తో వాన్ డె జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు.
బెడెన్‌తో గంటా 44 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. జాండ్‌షుల్ప్‌తో జరిగిన పోరులో నాదల్ ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో 15వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–3, 6–1, 6–2తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో 14వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), అజరెంకా (బెలారస్) పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌లో బెన్‌చిచ్ 5–7, 6–3, 5–7తో 17వ సీడ్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా) చేతిలో, కెర్బర్ 4–6, సాస్నోవిచ్ (బెలారస్) చేతిలో, అజరెంకా 6–4, 5–7, 6–7 (5/10)తో జిల్ టెక్‌మన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment