
ఐదేళ్ల తర్వాత ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జొకోవిచ్ 6–2, 5–7, 6–3తో ప్రపంచ 69వ ర్యాంకర్ అలెగ్జాండర్ వుకిచ్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు.
‘మాస్టర్స్ సిరీస్’ ఈవెంట్స్‌లో జొకోవిచ్‌కిది 400వ విజయం కావడం విశేషం. కేవలం రాఫెల్ నాదల్ (స్పెయిన్) మాత్రమే మాస్టర్స్ టోర్నీల్లో 400కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment